Moviesఆ హీరోకి సపోర్ట్ గా నరేష్.. ఇంతకి ఏం జరిగిందో తెలుసా..??

ఆ హీరోకి సపోర్ట్ గా నరేష్.. ఇంతకి ఏం జరిగిందో తెలుసా..??

అల్ల‌రి న‌రేష్..ఈ పేరుకి అసలు పరిచయమే అవసరం లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. కెరీర్ ఆరంభం నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు అల్లరి నరేష్. మొదటి సినిమా ‘అల్లరి’ నుంచి ఆయన ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఒక్కప్పుడు ఈయన సినిమాలు వస్తున్నాయంటే.. జనం కాచుకుని కుర్చుని చూసేవారు. ఆ తరువాత క్రమీనా ఆయన సినిమలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకొలేకపోయాయి.

తాజాగా టాలీవుడ్ యాక్ట‌ర్ అల్ల‌రి న‌రేష్ చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత నాంది చిత్రంతో మంచి హిట్ కొట్టి..మళ్లీ ఫాం లోకి వచ్చాడు. ప్ర‌స్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం గా “సభకు నమస్కారం” అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా చిత్రాన్ని సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ గా దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

అంతేకాదు ఈయన మైన్ హీరోగా చేస్తూనే .. సపోర్టింగ్ ఆర్టిస్టుగా సినిమాలు కూడా చేశారు. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ వంటి సినిమాల్లో ఆయన చేసిన సపోర్టింగ్ పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు మరో హీరో కోసం అల్లరి నరేష్ సపోర్టింగ్ పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.మంచు మ‌నోజ్ అహం బ్ర‌హ్మాస్మి చిత్రం చేస్తున్న విషయం తెలిసందే.

తాజాగా ఈ సినిమాలో నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు అని టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లైమాక్స్‌కి ముందు వచ్చే ఈ పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని.. అసలు హీరో కన్నా కూడా ఈ పాత్ర టోటల్ కధని మలుపు తిప్పుతుందని అందుకే అల్ల‌రి న‌రేష్ ఈ క్యారెక్టర్ లో న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news