Gossipsహీరోగా బండ్ల పారితోషికం ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

హీరోగా బండ్ల పారితోషికం ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

బండ్ల గణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారిన బండ్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండడం వలన చాలా తొందరగా సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నిర్మాతగా అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఆ త‌ర్వాత‌ సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌లోకి వెళ్ళాడు. టాలీవుడ్ లో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదిగిన గణేష్ రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టించాలని చాల ప్రయత్నాలు చేసాడు. అయితే ఆయన ప్లాన్ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇక లాభం లేదు అనుకున్నాడో ఏమో తెలియదు కాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ చంద్ర అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బండ్ల గణేష్ ఆ సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ అంశంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ చిత్రానికి బండ్ల గణేష్ ఎంత పారితోషికం పుచ్చుకుంటున్నాడొ తెలుసా? .. అక్షరాలా 25 లక్షల రూపాయలు అందుకుంటున్నారట. మొదటిసారి హీరోగా నటిస్తున్నాడు కాబట్టి బండ్ల గణేష్ ఇరేంజ్ పారితోషికం అందుకుంటునాడని..తరువాత వచ్చే సినిమాలకి మాత్రం పారితోషం బాగా పెంచేస్తాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news