Moviesమందేసి చిందేసిన మగువ.. నడిరోడ్డు పై అలా ఛీ..ఛీ..??

మందేసి చిందేసిన మగువ.. నడిరోడ్డు పై అలా ఛీ..ఛీ..??

మందుకు ఆడ మగా తేడా లేదు..మద్యం ఎలాంటి వారినైనా.. లొంగ దీసుకుంటుంది. ఎవరు తాగినా కిక్కు ఇస్తుంది. తాగుతున్న కొద్దీ ఎక్కేస్తుంది. ఇందులో కులమత బేదాలుండవు.. ఆడమగ తేడాలుండవు. ఒక్కసారి చుక్క నోట్లో పడితే అంతే.. నానా రచ్చ చేస్తారు మందుబాబులు. సాధారణంగా మందు తాగితే కొందరు మందు బాబులు చిందులేస్తారు. మరికొందరైతే.. ఇంటికెళ్లి చిందులేస్తారు. నన్ను ఎవరు ఏం చెయ్యలేరు.. నాకు ఏం అవుతుంది అన్న ధీమాతో విచ్చలవిడిగా తాగేస్తున్నారు మందుబాబులు. జనరల్ గా చాలా వరకు అబ్బాయిలే మందుతాగుతారు. అమ్మాయిలు కూడా తాగుతారు కానీ రచ్చ రచ్చ చేయ్యరు అని అనుకునేవారు.

కానీ ఇప్పుడు ఆ మాట తుడిచి పెట్టుకోపోయింది. ఓ మహిళ ఫుటుగా మందు తాగింది. తాగి రోడు పై యోగా చేసింది . ఇంకేముంది ఆమెను ఆపడం ఎవరీ తరం కాలేదు. చెబితే వినే రకం కూడా కాదు.. ఇంకేముంది నడిరోడ్డుపైనే రచ్చ రచ్చ చేసింది. తాజా గా దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుణెలోని తిలక్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తిలక్ రోడ్డులోని హీరాబాగ్ చౌక్ వద్ద మహిళ ఈ పనిచేసింది.

మెట్రోపాలిటన్ సిటీ అయిన పుణెలోని తిలక్ రోడ్డులో హిరాబాగ్ చౌక్ ఉంది. అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సరిగ్గా ఆ స్పాట్‌లోకి ఎంటరైంది తాగుబోతు యువతి. నేరుగా రోడ్డుమీదకు వచ్చి కూర్చుంది. ఊగుతూ, తూలుతూ రాత్రివేళ రోడ్డు మధ్యలోకి వచ్చింది. వాహనదారులకు చుక్కలు చూపించింది. అటు, ఇటు తిరిగే ప్రయత్నం చేసింది. చివరికీ రోడ్డుపైనే వెల్లకిలా పడుకొని ఉంది.

ఆ తర్వాత యోగాసనాలు వేయడం స్టార్ట్ చేసింది. రోడ్డుమీదనే పడుకొని బొర్లాడింది. దీంతో.. వాహనాలన్నీ మెల్లగా వస్తూ.. ఆమెను తప్పించుకొని పోవడానికి ఇబ్బందులు పడ్డాయి. దీనిపై పోలీసులకు ఫోన్‌ రావడంతో.. అక్కడికి వెళ్లే సరికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. కాగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news