Moviesఈ డ్రైవర్ జీతం తెలిస్తే దిమ్మ తిరిగిపోల్సిందే.. స్పెషాలిటి ఏంటంటే..??

ఈ డ్రైవర్ జీతం తెలిస్తే దిమ్మ తిరిగిపోల్సిందే.. స్పెషాలిటి ఏంటంటే..??

తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటన డాన్సులతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ అందరితో ఎంతో సరదాగా ఉండే మనస్తత్వం కలవాడని అందరు అంటుంటారు. సాధారణంగా హీరోలు అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం.. ప్రత్యేకంగా ఒక క్యారవాన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఏ హీరో స్థాయికి తగ్గట్టు ఆ రేంజ్లో వారు ఉపయోగించే వస్తువులను మెయింటైన్ చేస్తుంటారు. ఈ విషయంలో అల్లు అర్జున్ స్టైలే వేరు. తన కోసం తనకు నచ్చినట్లుగా ప్రత్యేకంగా పూణేలో క్యారవాన్ డిజైన్ చేయించుకున్నారు. దీని కోసం ఆయన ఎంత ఖర్చు చేసారో తెలుసా..??

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏరి కోరి దాదాపు 7 కోట్లు ఖర్చుపెట్టి తన కోసం ఫల్కన్(క్యారవాన్) కొన్నారు. ఐతే దాన్ని నడిపే డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే మతి పోతుంది. తన క్యారవాన్ డ్రైవర్ కు లక్ష నుంచి రెండు లక్షల వరకు జీతం చెల్లిస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు స్టైలిష్ స్టార్ బన్నీ ఎంత కాస్ట్లీ హీరో అనేది.

ఈ క్యారవాన్ మాములు వెహికల్ కాకపోవడంతో దిన్ని నడిపే డ్రైవర్ దాదాపు 2 నెలలు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఇంద్ర భవనాన్ని తలపించే క్యారవాన్ ని రథసారధిగా గల లక్ష్మణ్ మాట్లాడుతూ మొదట్లో బోయపాటి దగ్గర చేశానని,సరైనోడు సినిమా సమయంలో బన్నీ దగ్గర చేరానని వివరించాడు. అంత్యంత కాస్ట్లీ వెహికల్ కనుక అన్నీ పరిశీలించి తర్ఫీదు పొంది డ్రైవ్ చేస్తున్నానని చెప్పాడు.

‘క్యారవాన్ సరిగ్గా వాల్వ్ బస్సులా ఉంటుంది. టైర్లు,మిర్రర్స్ అన్నీ బన్నీ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు. పుష్షింగ్ ఎక్కువ. హైట్, వెయిట్ తక్కువ గా ఉంటాయి. సెట్ లో ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే అక్కడికి వెళ్తుంది. భారత్ బెంజి మోడల్ కనుక అద్దాలతో ఉంటుంది. ఎలా పడితే అలా నడపకూడదు. ఇండియాలో ఎక్కడ షూటింగ్ జరిగినా వెళ్తాం కాబట్టి,80కిమీ స్పీడ్ లాక్ పెట్టించారు’అని డ్రైవర్ లక్ష్మణ్ వివరించాడు. మొదటి నుంచి మెగా ఫామిలీ అభిమాని కావడం,ఇప్పుడు బన్నీ దగ్గర చేరి , డ్యూటీ చేయడం హ్యాపీ గా ఉందంటున్నాడు. మా ఊరు వాళ్ళు కూడా నేను ఇలా పనిచేయడం పట్ల ఆనందంగా ఉన్నారని చెప్పాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news