Moviesమీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు... దుమ్మురేపిన ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ..!

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు… దుమ్మురేపిన ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో తెలుగు బుల్లితెర మీద పెద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు. తెలుగులో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ షో తొలి సీజ‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో చూశాం. ఆ మాట‌కు వ‌స్తే ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్‌లో తొలి సీజ‌న్‌లో ఉన్నంత ఊపు మిగిలిన సీజ‌న్లలో లేద‌నే చెప్పాలి. ఎన్టీఆర్ ఎన‌ర్జీ, ఛ‌రిష్మా బిగ్‌బాస్‌ను టాప్ లెవ‌ల్లో నిల‌బెట్టేశాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఎన్టీఆర్ హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వ‌రుడు షో రానుంది. ఈ షో షూటింగ్ ఈ రోజు అన్న‌పూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయ్యింది. ఈ షోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. జెమినీ టీవీ ఈ షోను తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసేందుకు వ్యూహాలు ప‌న్నుతోంది. ఇక ఈ షోను హోస్ట్ చేసినందుకు గాను ఎన్టీఆర్‌కు రు. 12 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. ఈ షోను స్టార్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే మంచి హైప్ వ‌చ్చింది.

వాస్త‌వానికి మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మే చివ‌రి వారం నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఇక ఇప్పుడు ఎట్ట‌కేల‌కు షో స్టార్ట్ అవుతోంది. ఈ మ‌రి ఈ షో బుల్లితెర రికార్డుల‌ను ఎలా ? షేక్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news