తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబు చిత్ర పరిశ్రమకి రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైయ్యాడు. రాజకుమారుడు సినిమా హిట్ తో మహేష్ బాబు ఇంక తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు.
అయితే, ఎన్నో బ్లాక్ బస్టర్ మువీస్ అందించిన మహెష్ బాబు ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు అంటే నమ్ముతారా..?? అవునండి ఇంత వరకు మహెష్ బాబు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు.. ఎంతో మంది దర్శక నిర్మాతలు మహేష్ బాబుకి ఎన్నో సార్లు రీమేక్ సినిమాలో ఆఫర్ ఇచ్చినా కూడా మహేష్ బాబు రీమేక్ సినిమాలని చేయను అని తిరస్కరించారట.
అయితే ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది మహేష్ బాబుని రీమేక్ సినిమాలు అంటే ఎందుకు ఆసక్తి ఉండదు అని అడిగారు. అందుకు మహేష్ బాబు చెప్పే సమాధానం ఒక్కటే. రీమేక్ సినిమాలు అంటే ఆల్రెడీ ఒరిజినల్ లో నటించిన హీరో ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ తో నేను నటించలేను. ఒకవేళ నేను నటించినా కానీ ఒరిజినల్ వెర్షన్ లో నటించిన హీరోనే మొదటి గా కనిపిస్తారు. కాబట్టి సెకండ్ ఇంపాక్ట్ తో నేను నటించలేను అని చెప్పారట.