Moviesపోలా..అదిరిపోలా.. ఏమైనా నీ టైం బాగుందిలే తల్లి..!!

పోలా..అదిరిపోలా.. ఏమైనా నీ టైం బాగుందిలే తల్లి..!!

బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు గట్టి ఫాలోయింగ్ ఉంది. విరుష్క జంట కు దేశమంతా అభిమానులు ఉన్నారనడం లో ఆశ్చర్యం లేదు. ఓ కమర్షియల్ ఆడ్ లో దగ్గరైన విరాట్, అనుష్క ప్రేమలో పడి వివాహబంధం ఏర్పరుచుకున్నారు. ఈ ఏడాది వారి జీవితం లోకి వారి ముద్దుల కూతురు వామిక కూడా ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, తన భర్త విరాట్ కోహ్లీ, కూతురు వామికాలతో కలిసి ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఇంగ్లండ్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. లేటెస్ట్ గా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఆ ఫోటోనే ఇప్పుడు అనుష్క శర్మ ట్రోలింగ్ అవ్వడానికి కారణమైంది.

ఈ ఫొటోలో తన హెయిర్ కట్‌తో పాటు ఖరీదైన వాచ్‌ను ధరించి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనుష్క శర్మ బ్లాక్ అండ్ వైట్ టాప్ ధరించి ఫొటోకు ఫోజులిచ్చింది. తన చేతికి ఉన్న రోజ్ గోల్డ్ రోలెక్స్ వాచ్ ధర ఎంతో తెలుసా.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అనుష్క పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ధర 65,879 డాలర్లు.. అంటే.. మన ఇండియన్ కరెన్సీ లో ఈ వాచ్ ధర సుమారు యాభై లక్షల రూపాయల వరకు ఉంటుంది.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాచ్‌ను చూసిన అభిమానులంతా నోరెళ్లబెడుతున్నారు. అంత ఖరీదైన వాచ్‌ను ధరించావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news