ప్రభాస్.. ఆ పేరులోనే ఏవో వైబ్రేషన్స్ ఉన్నాయి కదండీ. ఆరు అడుగుల అందగాడు.. హైట్ కు తగ్గ వెయిట్.. ఆ కటౌట్ చూసి పడిపోని అమ్మాయి అంటూ ఉంటుందా..పెళ్ళి అయిన ఆంటీలకు కూడా ప్రభస్ అంటే క్రష్ ఉండనే ఉంటుంది..ఈ కండల వీరుడు ని చూసి ఎలాంటి వారైనా సరే.. ఏమున్నాడు రా బాబు అని అనాల్సిందే. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘డార్లింగ్’ అని అనిపించుకున్న ఏకైక హీరో మన ప్రభాసే. చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు 21 మాత్రమే. అయితే ప్రభాస్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు 10 వరకు ఉన్నాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలని, మరికొన్ని డిజాస్టర్ మూవీస్ ఉనాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్కడు : మహేష్ బాబు కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం మొదట వరించింది ప్రభాస్ నే. ప్రభాస్, కృష్ణంరాజు లను దర్శకుడు గుణశేఖర్ కలిసి కథ వినిపించారట. స్క్రిప్ట్ రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేసారని టాక్.
దిల్ : నితిన్ యాక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దిల్’ సినిమా మొదట ప్రభాస్ కే వినిపించాడట వినాయక్. కానీ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.
సింహాద్రి : టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాసిన సినిమా‘సింహాద్రి’. ఈ కథను కూడా ఫస్ట్ ప్రభాస్ కే వినిపించాడట రాజమౌళీ. ఈ మాస్ సబ్జెక్టు ను ఈయన హ్యాండిల్ చేయగలడా అని ఆలోచించి ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేసాడట.
ఆర్య : బన్నీ.. అదేనండి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున కెరీర్ లోనే బ్లాక్ బస్ట హిట్ గా నిలిచిన ఈ సినిమా కథని కూడా సుకుమార్, దిల్ రాజు.. మొదట ప్రభాస్ కి వినిపించారట. రీజన్స్ తెలియవు కానీ ఈ సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్ రిజెక్ట్ చేసాడు.
బృందావనం : ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘బృందావనం’ కథని ప్రభాస్ కి వినిపిస్తే అప్పటికే ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడట.
నాయక్ : రాం చరణ్ నటించిన ఈ ‘నాయక్’ కథని వినాయక్ ప్రభాస్ కి వినిపిస్తే.. అప్పుడు ‘రెబల్’ ‘మిర్చి’ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పాడట ప్రభాస్.
కిక్ : రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన ‘కిక్’ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపే.. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట.
ఊసరవెల్లి : ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ వద్దకే వెళ్లింది.. కానీ రిజెక్ట్ చేసాడు ప్రభాస్.
డాన్ శీను : గోపీచంద్ మలినేని మొదట ‘డాన్ శీను’ కథని ప్రభాస్ కోసం రెడీ చేసుకున్నాడట. ‘బుజ్జిగాడు’ లో క్యారెక్టర్ కి దాదాపు సేమ్ ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసాడని.. అందుకే రవితేజ చేసాడని టాక్
జిల్ : ‘బాహుబలి’ తో ప్రభాస్ బిజీగా ఉన్న టైములో ‘జిల్’ కథ ప్రభాస్ వద్దకు వచ్చిందట. డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక.. అదే కథని తన స్నేహితుడు గోపీచంద్ కు చేయమని చెప్పాడట.