రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న ఇమేజ్ గురించి.. ఈ పేరుకు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు తెలుగులో కమెడియన్లు అని సపరేట్గా ఉండేవాళ్లు. కానీ రాజేంద్రప్రసాద్ వచ్చిన తర్వాత కామెడీ హీరోలు వచ్చారు. సినిమాలో ఎక్కడో ఓ చోట కామెడీ కాకుండా సినిమా అంతా కామెడీతోనే నడిపించడం అంటే చిన్న విషయం కాదు. కానీ దాన్ని ఎన్నో సినిమాల్లో చేసి చూపించాడు రాజేంద్ర ప్రసాద్. అందుకే ఆయన నట కిరీటి అయ్యాడు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం మనకు తెలిసిందే. తన సినిమా ఇప్పటికి కూడా బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే నవ్వకుండా ఎవరు ఉండలేరు. అంతలా ఆయన తన నటనతో బాగా అందరినీ ఆకర్షించాడు. ఇక ఈయన భార్య ఎవరు..?? పిల్లలు ఎంత మంది అని చాలా మందికి తెలియకపోవచ్చు.
ఎందుకంటే వీళ్లు ఎక్కువ మీడియా ముందుకు రారు కాబ్బటి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు విజయ చాముండేశ్వరి. విజయ చాముండేశ్వరి ఎవరో కాదు రమప్రభా గారి అక్క కూతూరు. రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి పేరు బాలాజీ.. కూతురు పేరు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్ సినిమా షూటింగ్స్ సమయంలో రమాప్రభగారి ఇంటికి తరచూ వెళ్తూ.. అక్కడే ఉన్న వాళ్ల అక్క కూతురిని చూసి పెళ్లి అంటు చేసుకుంటే ఈవిడనే చేసుకోవాలని డిసైడ్ అయాడట. ఇక అలా అల్ల సీన్ కట్ చేస్తే వీళ్ల పెళ్లి చెన్నైలోని కపాలేశ్వర స్వామి గుళ్లో జరిగింది. ఆ తర్వాత వాణీ మహల్లో రిసెప్షన్ జరిగింది.
టాలీవుడ్ లో అగ్ర హాస్య నటీమణుల్లో రమాప్రభ ఒకరు. మహామహుల సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటిగా నటించారు. ఆమె తమ్ముడిగా భావించే దివంగత నటుడు రాజబాబు తోనే దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అలాగే అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, రేలంగి తదితరుల పక్కన ప్రాముఖ్యత కలిగిన క్యారెక్టర్ లలో మెప్పించారు. సినిమాల్లో నటిస్తూనే ప్రముఖ నటుడు శరత్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న రమాప్రభ 13 ఏళ్ల కాపురం తరువాత విడిపోయారు