Newsగంటాకు ఇది లోకేష్ మార్క్ చెక్ అనుకోవాలే...!

గంటాకు ఇది లోకేష్ మార్క్ చెక్ అనుకోవాలే…!

గంటా శ్రీనివాస‌రావు అధికారం ఎక్క‌డ ఉంటే.. అక్క‌డే ఉంటార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయ్య‌న్న పాత్రుడి శిష్యుడిగా టీడీపీలోకి వ‌చ్చి 1999లో అన‌కాప‌ల్లి ఎంపీ అయిన గంటా ఆ త‌ర్వాత 2004లో మంత్రి కోరిక‌తో చోడ‌వ‌రం ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీ రావ‌డంతో కుల ఈక్వేష‌న్లో ఆ పార్టీలోకి జంప్ చేసి 2009లో అన‌కాప‌ల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. క‌ట్ చేస్తే ప్ర‌జారాజ్యం చిత్తుగా ఓడింది. త‌ర్వాత చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డంతో ఆ కోటాలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కిర‌ణ్ కుమార్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మ‌ళ్లీ 2014లో టీడీపీలోకి వ‌చ్చి ఈ సారి భీమిలి నుంచి పోటీ చేసి మ‌రోసారి మంత్రి అయ్యారు. ఇక గ‌త ఎన్నికల్లో గంటా పార్టీ మార‌లేదు కాని.. భీమిలికి బైబై చెప్పేసి ఈ సారి విశాఖ న‌గ‌రంలో నార్త్ నుంచి పోటీ చేశారు. గంటా కెరీర్లోనే చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచిన గెలుపు గ‌త ఎన్నిక‌ల్లోనే ?

గ‌త ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి గంటా పార్టీలో యాక్టివ్‌గా లేరు. పైగా ఆయ‌న వైసీపీకి వెళ‌తార‌ని.. బీజేపీలోకి వెళ‌తార‌ని వార్తలు వ‌స్తున్నాయి. పైగా ఆయ‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డం పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. చంద్ర‌బాబు, లోకేష్ సైతం గంటా తీరుపై అస‌హ‌నంతోనే ఉన్నారు. అయితే గంటాను ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. గంటా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందు వ‌రకు వెయిట్ చేసి.. అప్పుడు పార్టీ అధికారంలోకి రాద‌ని డిసైడ్ అయితే పార్టీ జంప్ చేసేస్తారు.. లేక‌పోతే పార్టీలో ఉండి.. గెలుస్తుంద‌న్న ఆశ ఉంటే.. మ‌ళ్లీ భీమిలికి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.

అయితే గంటా ఎత్తుల‌కు లోకేష్ మార్క్ చెక్ పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది. అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన స‌బ్బం హ‌రి ఇటీవ‌ల మృతి చెందారు. దీంతో మాజీ ఎంపీపీ కోరాడ రాజ‌బాబును టీడీపీ అధినాయకత్వం సడెన్ గా భీమిలీకి ఇంచార్జిని నియమించింది. అంటే గంటా ఆశ‌ల‌కు లోకేష్ వ్యూహాత్మ‌కంగా చెక్ పెట్టేశారు. వ‌చ్చే ఎన్నికల వ‌ర‌కు ఈ ఇన్‌చార్జ్‌తో క‌థ న‌డిపించి.. ఆ త‌ర్వాత పార్టీ మూమెంట్‌ను బ‌ట్టి అక్క‌డ లోకేష్ పోటీ చేయ‌డ‌మా ? లేదా ? భ‌ర‌త్ పోటీ చేయ‌డ‌మో జ‌రుగుతుంద‌ని టాక్ ?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news