Moviesఒక్క యేడాదిలో నాగార్జున‌కు ఇన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్లా... సూప‌ర్ రికార్డు..!

ఒక్క యేడాదిలో నాగార్జున‌కు ఇన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్లా… సూప‌ర్ రికార్డు..!

నాగార్జున..టాలీవుడ్ మన్మధుడు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తరువాత టాలీవుడ్‌లో తనదైన ముద్రవేసాడు ఈ అక్కినేని అందగాడు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు చిరునామాగా నిలిచాడు నాగార్జున. అంతేకాదు కొత్తదనాన్ని ప్రోత్సహించాలన్నా..ప్రయోగాలు చేయాలన్నా…సంచలనాలు క్రియేట్ చేయాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు నాగార్జునదే. కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఆయన తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను, నటులును టాలీవుడ్ కి పరిచయం చేశారు. దాదాపు 60 ఏళ్లకు దగ్గరైనా మన్మధుడిలా నవనవలాడుతూ యువ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ బాక్సాఫీసు రేసులో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు నాగార్జున.

ఇటువంటి ట్రాక్ రికార్డు వున్న నాగార్జున.. ఒకే సంవత్సరంలో దాదాపు ఐదు సినిమాలను విడుదల చేసారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడుదల చేయడం అంటే మాములు విషయం కాదు. ఇటీవలకాలంలో మనం చూసినట్లైతే.. ప్రస్తుత హీరోలు ఒక సంవత్సరానికి ఒకటి , మహా అయితే రెండు సినిమాలను విడుదల చేయడమే గగనంగా మారింది. అలాంటిది మన టాలీవుడ్ మన్మధుడు.. ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా.. ఆ సినిమాలనుబాక్స్ ఆఫిస్ దగ్గర బ్లాగ్ బస్టర్ గా నిలబెట్టాడు నాగార్జున. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్: విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినప్పటికీ, నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

విక్కీ దాదా: విక్కీ దాదా 1989 లో వచ్చిన నేర చిత్రం. కామాక్షి ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి. శివప్రసాదరెడ్డి నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగార్జున, రాధా, జూహి చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. హిందీలో మేరీ దునియా గా అనువదించారు.

గీతాంజలి: గీతాంజలి 19 మే 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.

శివ: శివ మూవీ రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చింది. ఈ సినిమా కి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. గీతాంజలి సినిమా ద్వారా క్లాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నాగార్జున శివ మూవీ ద్వారా మాస్ ఆడియన్స్ కి కూడా మరింత చేరువయ్యారు. ఇండస్ట్రీ హిట్ గా మిగిలిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ కి నంది అవార్డు వచ్చింది.

అగ్ని: అగ్ని 1989లో విడుదలైన తెలుగు సినిమా. సౌభాగ్యలక్ష్మీ పిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ నిర్మాత కాగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్నందించింది. అంతే కాదు ప్రముఖ సీనియర్ నటి రాశి కూడా ఇందులో బాలనటిగా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news