Moviesటాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ మ‌న‌వ‌డితో హీరోయిన్ కూతురు డేటింగ్ ?

టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్ మ‌న‌వ‌డితో హీరోయిన్ కూతురు డేటింగ్ ?

బాలీవుడ్‌లో ఇటీవ‌ల టాప్ సెల‌బ్రిటీల త‌న‌యులు కూడా డేటింగ్ చేస్తూ వార్త‌ల్లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ న‌టి పూజాబేడీ కుమార్తె ఆల‌య ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుటుంబానికి చెందిన మ‌న‌వ‌డితో డేటింగ్‌లో ఉన్న‌ట్టు బీ టౌన్ మీడియాలో ఒక్క‌టే వార్త‌లు గ‌ప్పుమంటున్నాయి. ఈ వార్తలు మెయిన్ మీడియాలో కూడా రావ‌డంతో ఆల‌య త‌మ‌ది స్నేహం మాత్ర‌మే అని.. ప్రేమ కాద‌ని చెపుతున్నా ఈ పుకార్లు మాత్రం ఆగ‌డం లేదు. దివంగ‌త శివ‌సేన అధినేత బాలా సాహెబ్ మ‌న‌వ‌డు ఐశ్వ‌రీ ఠాక్రేతో ఆల‌య డేటింగ్‌లో ఉంద‌ని అంటున్నారు.

ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే క‌నిపిస్తున్నారు. ప్ర‌తి పార్టీలోనూ చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. త‌న కుమార్తె డేటింగ్ వార్త‌ల‌పై పూజా బేడీ కూడా స్పందించారు. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వారి విష‌యంలో ఇలాంటి గాసిప్స్ రావ‌డం చాలా కామ‌న్ అని ఆమె సింపుల్‌గా తీసుకున్నారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం త‌న ఇష్ట‌మైన‌ప్పుడు .. త‌న కుమార్తెకు కూడా ఆ స్వేచ్ఛ ఉంద‌ని.. ఆమె జీవితం ఆమె ఇష్ట‌మ‌ని పూజా చెప్పారు. ఇటు త‌ల్లి కూడా ఫ్రీడ‌మ్ ఇచ్చేయ‌డంతో ఇక ఆల‌య జోరుకు బ్రేకులు వేసేదెవ్వ‌రు ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news