Moviesబ్రేకింగ్‌: క‌త్తి మ‌హేష్ ప‌రిస్థితి తీవ్ర విష‌మంగా ఉందా..!

బ్రేకింగ్‌: క‌త్తి మ‌హేష్ ప‌రిస్థితి తీవ్ర విష‌మంగా ఉందా..!

ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు, సినీ న‌టులు క‌త్తి మ‌హేష్ ప్ర‌యాణిస్తోన్న కారు ఈ రోజు యాక్సిడెంట్‌కు గురైంది. చెన్నై – క‌ల‌క‌త్తా జాతీయ ర‌హ‌దారిపై నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తోంది. కారులో మ‌హేష్ తో పాటు కారు డ్రైవ‌ర్ ఉన్నారు. డ్రైవ‌ర్ ఇచ్చిన స‌మాచారంతో పెట్రోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆయ‌న్ను హుటాహుటీన నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం మ‌హేష్ అక్క‌డ‌ చికిత్స పొందుతున్నారు. ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో ఆయ‌న్ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

విశ్వ‌స‌నీయంగా అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ ప‌రిస్థితి తీవ్ర విష‌మంగా ఉందంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ప్ర‌మాదంలో ఆయ‌న క‌న్ను తీవ్రంగా దెబ్బ‌తింద‌ని.. ప్ర‌స్తుతం కంటి ఆప‌రేష‌న్ పూర్తి కావ‌డంతో ఆయ‌న అవుట్ ఆఫ్ డేంజ‌ర్ అని అంటున్నారు. ఇక ఆయ‌న ఆరోగ్యం గురించి సాయంత్రానికి హాస్ప‌ట‌ల్ వ‌ర్గాలు బులిటెన్ రిలీజ్ చేయ‌నున్నారు. మ‌హేష్‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలియ‌డంతో ఇండ‌స్ట్రీలో ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు ఎలా ఉందా ? అని ఆరా తీస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news