లూసీఫర్ రీమేక్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి ఆదినుంచి టైం కలిసి రావడం లేదు. ముందుగా ఈ సినిమా కోసం సుకుమార్‌ను డైరెక్టర్ అనుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ ఆసక్తిగా లేకపోవడంతో చరణ్ పట్టుబట్టి మరీ సాహో సుజీత్‌ను తీసుకురాగా.. సుజీత్ మార్పులు నచ్చక పక్కన పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి పట్టుబట్టి మరీ వినాయక్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. వినాయక్ తనదైన స్టైల్లో కొన్ని మార్పులు, చేర్పులతో పాటు కొన్ని సీన్లు రెడీ చేసి చిరంజీవికి చెప్పారట.
అవి విన్న వినాయక్ ఈ కథ వదిలేద్దాం… మరో కథతో సినిమా చేద్దామని సింపుల్‌గా చెప్పి పంపేశారట. వినాయక్ చెప్పిన కామెడీ సీన్లు మెగాస్టార్‌ను ఏ మాత్రం మెప్పించ లేకపోయాయట. దీంతో వినాయక్‌ను కూడా లూసీఫర్ రీమేక్ నుంచి తప్పించేశారంటున్నారు. వినాయక్‌ను పక్కన పెట్టాక చిరు మరో ఒకరిద్దరు దర్శకులతో లూసీఫర్ మార్పుల గురించి చర్చించాడట. దీనిపై ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ఏంటంటే వినాయక్ చెప్పిన కామెడీ సీన్లు పాత చింత కాయపచ్చడి కన్నా ఘోరంగా ఉన్నాయట.
అందుకే చిరు వినాయక్‌కు ఈ కథ వదిలేయమని చెప్పారని గుసగుసలాడుకుంటున్నారు. వినాయక్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఆలీ, బ్రహ్మానందంతో చేయించిన కామెడీ సీన్లపై కూడా లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. మరీ ఈ సారి అంతకు మించిన నాసిరకం కామెడీ సీన్లే చిరుకు వినిపించారా ? అని కూడా కొందరు చర్చించుకుంటున్నారు.