హైద‌రాబాద్‌లో అమ్మాయిలు కావాలా.. కొత్త దందా ఇదే…!

హైద‌రాబాద్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మాయిలతో ఎంజాయ్ చేసే వారికి, డ్ర‌గ్స్ మ‌త్తులో తూలేవారికి కొద‌వ‌లేదు. అయితే ఇప్పుడు ఓ కొత్త దందాకు తెర‌లేచింది. ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు ముఖ్యంగా గోవా నుంచి అమ్మాయిల‌ను తీసుకు వ‌చ్చి వారితో వ్య‌భిచారం చేయించ‌డంతో పాటు వారితోనే డ్ర‌గ్స్ కూడా స‌ర‌ఫ‌రా చేసే కొత్త దందాకు నిర్వాహ‌కులు తెర‌లేపారు. ఆన్‌లైన్ ద్వారా వ్య‌భిచారం, డ్ర‌గ్స్ దందా చేస్తోన్న వారిని తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

డ్ర‌గ్ పెడ్ల‌ర్స్ ఈశాన్య రాష్ట్రాలు, గోవా నుంచి అమ్మాయిల‌ను తీసుకు వ‌చ్చి వ్య‌భిచారం చేయించ‌డంతో పాటు వారితోనే డ్ర‌గ్స్ కూడా స‌ర‌ఫ‌రా చేయిస్తున్నార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈశాన్య ప్రాంతాలతో పాటు గోవా నుంచి అమ్మాయిలను ఇక్కడకు రప్పిస్తున్నారు. వీరితో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాతో పాటు వ్య‌భిచార దందా కూడా చేయిస్తున్నారు. విటుల వ‌ద్ద‌కే అమ్మాయిల‌ను పంప‌డంతో పాటు డ్ర‌గ్స్ కావాల్సిన వారి వ‌ద్ద‌కు కూడా వీరినే పంపి మ‌రీ స‌ర‌ఫ‌రా చేయిస్తున్నారు.

ఈ న‌యా ట్రెండ్‌పై హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం కావ‌డంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వ‌ల‌ప‌న్నీ మ‌రీ ప‌ట్టుకున్నారు. దీనిపై పోలీసులు మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.