త్రిష పెళ్లిపై కొత్త రూమ‌ర్‌… ముదురు ముద్దుగుమ్మ ట్విస్ట్ ఇచ్చిందే

సౌత్ ఇండియాలో రెండు ద‌శాబ్దాలుగా హీరోయిన్‌గా కొన‌సాగుతోంది త్రిష‌. 37 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా ఈ ముదురు ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు. త్రిష‌కు గ‌తంలో ప‌లువురు హీరోల‌తో ఎఫైర్లు ఉన్నాయ‌న్న వార్తలు వ‌చ్చాయి. ఇక టాలీవుడ్లో ఓ బ‌డా ఫ్యామిలీ హీరోతో త్రిష పీక‌ల్లోతు ప్రేమలో మునిగిపోవ‌డంతో పాటు వారిద్ద‌రు ప‌బ్లిక్‌గా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు కూడా. ఆ త‌ర్వాత వారు సైలెంట్ అయ్యారు. ఇటీవల స‌ద‌రు హీరోకు పెళ్ల‌యిన విష‌యం తెలిసిందే.

 

ఇక త్రిష‌కు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, నిర్మాత వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో ఎంగేజ్మెంట్ జ‌రిగాక‌, ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. 21 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న త్రిష‌కు ఇప్పుడు 37 ఏళ్లు వ‌చ్చేశాయి. దీంతో ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ?  అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. అప్పుడెప్పుడో జోడీ సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె తెలుగులో నీ మ‌న‌సు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. అన‌తి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

తాజాగా మ‌రోసారి ఆమె పెళ్లి పుకార్ల‌పై వార్త‌లు రావ‌డంతో స్పందించిన త్రిష నా మ‌న‌సుకు న‌చ్చిన వ్య‌క్తి దొరికే వ‌ర‌కు పెళ్లి కోసం వెయిట్ చేస్తాన‌ని చెప్పింది. న‌న్ను అర్థం చేసుకునే వ్య‌క్తి నా జీవితంలోకి వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తాను.. అప్పుడే నా కొత్త జీవితం ప్రారంభ‌మ‌వుతుంద‌ని… అప్ప‌టి వ‌ర‌కు ఒంట‌రిగానే గ‌డుపుతాన‌ని త్రిష స్ప‌ష్టం చేసింది.