Moviesబిగ్‌బాస్ హిమ‌జ సినిమాకు విచిత్ర‌మైన టైటిల్‌... వామ్మో ఇదేం హ‌ర్ర‌ర్ టైటిల్‌

బిగ్‌బాస్ హిమ‌జ సినిమాకు విచిత్ర‌మైన టైటిల్‌… వామ్మో ఇదేం హ‌ర్ర‌ర్ టైటిల్‌

గత యేడాది బిగ్‌బాస్ సీజ‌న్లో లేడీ కంటెస్టెంట్ హిమ‌జ హౌస్‌లో చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేయ‌డంలో హిమజ‌ ఎప్పుడూ ముందు ఉండేది. అయితే హిమ‌జ హౌస్‌లో ఎక్కువుగా రాహుల్ సిప్లిగంజ్ – పున‌ర్న‌వి భూపాలం జంట‌నే ఎక్కువుగా టార్గెట్ చేసేది. పున‌ర్న‌వి కంటే హిమ‌జ ముందే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆ త‌ర్వాత పున‌ర్న‌వి ఎలిమినేట్ అయ్యాక హిమ‌జ నానా ర‌చ్చ ర‌చ్చ చేయ‌డంతో పాటు డ్యాన్సులు వేసిన వీడియో కూడా బాగా వైర‌ల్ అయ్యింది.

 

 

ఇక బిగ్‌బాస్‌తో వ‌చ్చిన క్రేజ్‌తో ఇప్పుడు హిమ‌జ వెండితెర‌పై కూడా ల‌క్ ప‌రీక్షించుకోబోతోంది. ఆమె ఓ సినిమా చేస్తోంది. హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కే  ఈ సినిమాకు జ అనే టైటిల్ పెట్టారు. ఇప్ప‌టికే ప‌లు సీరియ‌ల్స్‌తో పాటు సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన హిమ‌జ ఇప్పుడు సినిమాల్లో తొలిసారి లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాను జైదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై గోవర్ధన్‌ రెడ్డి రూపొందిస్తున్నారు. సైదిరెడ్డి తెరకెక్కిస్తున్నారు.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ కూడా సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ఈ సినిమా టైటిలే విచిత్రంగా ఉంది. మ‌రి జ హిమ‌జ సినీ కెరీర్‌ను ఎంత వ‌ర‌కు ట‌ర్న్ చేస్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news