శ‌భాష్ బాల‌య్య‌… సెల్ఫ్ డ‌బ్బాలు… గొప్ప‌లు లేకుండా చేశాడు..

యువ‌ర‌త్న బాల‌కృష్ణ‌కు ఏం సాయం చేసినా సెల్ఫ్ డ‌బ్బాలు కొట్టుకోవ‌డాలు.. గొప్ప‌లు పోవ‌డాలు ఉండ‌వు. తాజాగా బాల‌య్య హైద‌రాబాద్ వ‌రద‌ల నేప‌థ్యంలో బాధితుల‌ను ఆదుకునేందుకు రు 1.5 కోట్లు విరాళం ఇచ్చాడు. అయితే ఈ విష‌యంపై ఆయ‌న ఎక్క‌డా ప్ర‌క‌ట‌న‌లు చేసుకోలేదు. అయితే ఇది నిజ‌మా ?  కాదా ? అన్న సందేహాలు కొంద‌రికి వ‌చ్చాయి. అయితే బాల‌య్య విరాళం ఇచ్చిన మాట నిజ‌మే. అదే మిగిలిన స్టార్ హీరోలు అయితే ఎంత డ‌బ్బా కొట్టుకుంటారో ?  ఎంత ప్ర‌చారం చేసుకుంటారో వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

 

ఇక అప్పుడెప్పుడో త‌న ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మై ఆగిపోయిన న‌ర్త‌న‌శాల సినిమాలో అప్ప‌టి వ‌ర‌కు షూట్ చేసిన 17 నిమిషాల‌ను ఎడిట్ చేసి ద‌స‌రాకు రిలీజ్ చేస్తున్నారు. శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్ బీ కే థియేటర్ లోకి వెళ్లి కొంత మొత్తం చెల్లించి ఈ 17 నిమిషాల సినిమా చూడాలి. అయితే ఇందులో స‌గం చారిటీకి అని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. అది బాల‌య్య‌లో నిజాయితి. చేయాల‌ని ఉంటే చెప్పుకోవ‌క్క‌ర్లేదు.