బిగ్‌బాస్ కంటెస్టెంట్ల గుట్టు మొత్తం చెప్పేసిన కుమార్‌సాయి.. లోప‌ల ఇంత జ‌రుగుతోందా..

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ 4 నుంచి మ‌రో కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేష‌న్లో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. హౌస్‌లోకి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి షోలోకి వెళ్లిన తొలి రోజుల్లో చాలా సైలెంట్‌గా ఉండ‌డంతో పాటు బ‌ద్ధ‌కంగా ఉండేవాడు. ఆ త‌ర్వాత పుంజుకుని టాస్క్‌ల్లో గ‌ట్టి పోటీ ఇచ్చాడు. కుమార్ సాయికి బ‌య‌ట కూడా ఫ్యాన్స్ ఎక్కువ‌య్యారు. ఈ స‌మ‌యంలో కుమార్ సాయి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు.

Bigg Boss 4 Telugu: Kumar Sai becomes captain of the house!

బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయి లోప‌ల ఉన్న కంటెస్టెంట్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ఇంట‌ర్వ్యూలో సాయి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించ‌డంతో పాటు హౌస్‌లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ గుట్టు మొత్తం విప్పేశాడు. మోనాల్ ద‌గ్గ‌ర ఎప్పుడూ వ‌యోలిన్ ఉంటుందని.. అది మూడ్‌కు తగిన‌ట్టు వాయించుకుంటుందంటూ అభిజిత్ – అఖిల్‌తో ఆమె ల‌వ్ ట్రాక్ గురించి చెప్పాడు. దివి ఎప్పుడూ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ వెన‌క ఉంటుంద‌ని.. లాస్య న‌వ్వులో నిజాయితీ ఉండ‌ద‌ని చెప్పాడు.

Bigg Boss Telugu 4: Kumar Sai creates a rift between Abhijeet & Akhil

అఖిల్‌కు బ‌లం ఉన్నా బుద్ధి లేద‌ని.. రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ బ‌లం, బ‌ల‌హీన‌త రెండూ కామెడీయే అని చెప్పాడు. సోహైల్ బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డానికి స్నేహం అడ్డు పెట్టుకుంటున్నాడ‌ని.. అవినాష్ ఎలిమినేష‌న్ అంటేనే భ‌య‌ప‌డ‌తాడ‌ని చెప్పాడు. ఏదేమైనా కంటెస్టెంట్ల గురించి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.