బిగ్‌బాస్‌లో కుమార్ సాయి గాయం… వైద్యం లేక బ‌య‌ట‌కు వ‌చ్చాక తీవ్ర ఆవేద‌న..!

బిగ్‌బాస్ హౌస్‌లో ప‌లువురు కంటెస్టెంట్ల ఎలిమినేష‌న్ విష‌యంలో అనేక సందేహాలు కంటెస్టెంట్ల‌కే కాకుండా, ప్రేక్ష‌కుల‌కు కూడా ఉన్నాయి. ఇక తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయి ఎలిమినేష‌న్లో ముందు నుంచే ఉన్న అనుమానాలు నిజం చేస్తూ ఆయ‌న్నే బ‌య‌ట‌కు పంపారు. ఇక హౌస్‌లో 24 గంట‌ల ఫుటేజ్‌ను ఎడిట్ ఓ గంట మాత్ర‌మే చూపిస్తారు. అయితే ఇందులో చాలా వ‌ర‌కు చూపించ‌రు.

 

ఎన్నో విష‌యాలు.. ముఖ్యంగా రేటింగ్ రావ‌నుకున్న‌వాటిల్లో ఎంత నిజం ఉన్నా చూపించ‌రు. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన కుమార్ సాయి టాస్క్‌లు, గేమ్‌లు ఎంత బాగా ఆడాడో తెలిసిందే. అయితే అత‌డు వేగంగా పిండి రుబ్బే టాస్క్‌లో చాలా స్పీడ్‌గా టాస్క్ కంప్లీట్ చేశాడ‌ట‌. అయితే ఈ టాస్క్ చూపించ‌లేదు. ఇందులో కుమార్ సాయి చేతి వేలికి గాయం కూడా అయ్యింద‌ట‌.

 

ఈ టాస్క్ మొత్తం చూపించ‌క‌పోవ‌డం ఒక ఎత్తు అయితే.. క‌నీసం సాయి చేతికి సరైన మెడికల్ ఎయిడ్ కూడా ఇవ్వలేదట‌. బ‌య‌ట‌కు వ‌చ్చాక కుమార్ సాయి త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఈ బిగ్‌బాస్‌లో నిజ‌మైన కంటెస్టెంట్ల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న‌దే ఎక్కువ మంది చెపుతున్నారు.