ద‌‌ర్శ‌కురాలుగా మారుతోన్న లేడీ విల‌న్‌

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మ‌రీ స్టార్ హీరోయిన్ కాక‌పోయినా ఆ త‌ర్వాత లేడీ విల‌న్‌గా మాత్రం బాగా పాపుల‌ర్ అయ్యింది సినియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ కుమార్తె వ‌ర‌ల‌క్ష్మి. రెగ్యుల‌ర్ హీరోయిన్ల‌కు భిన్నంగా భిన్న‌మైన షేడ్ ఉన్న లేడీ విల‌న్ రోల్స్ చేస్తూ కోలీవుడ్ స్టార్ హీరోలు విజ‌య్‌, విశాల్ లాంటి వాళ్ల సినిమాల్ల వాళ్ల‌ను ఢీ కొట్టే బ‌ల‌మైన విల‌న్‌గా న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ర‌వితేజ క్రాక్ సినిమాలో కూడా ఆమె లేడీ విల‌న్‌గా న‌టిస్తోంది.

Sarkar': Varalaxmi Sarathkumar and Yogi Babu have a fun time on the sets |  Tamil Movie News - Times of India

ఈ క్ర‌మంలోనే ఆమె మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కురాలిగా మారుతోంది. ఆమె సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేసింది. తెన్నాండ‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ‌స్వామి నిర్మాత‌గా మారి క‌న్నామూచి సినిమా నిర్మిస్తున్నాడు. మ‌హిళా ప్రాధాన్య‌త ఉన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఓ ధైర్య‌వంత‌మైన మ‌హిళకు సంబంధించిన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Varalaxmi Sarathkumar signs new film titled 'Colors' | The News Minute

ఈ పోస్ట‌ర్‌ను ప‌లువురు మ‌హిళా హీరోయిన్లు పోస్ట్ చేసి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌కు శుభాభినంద‌న‌లు తెలిపారు. మ‌రి ఈ లేడీ విల‌న్ ద‌ర్శ‌కురాలిగా ఎలా మెప్పిస్తుందో ? చూడాలి.