మోహ‌న్‌బాబు పీక‌ల్లోతు క‌ష్టాలో ఉంటే ర‌జ‌నీ ఏం చేశాడంటే..!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ – క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు అనుబంధం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మోహ‌న్‌బాబు పెద‌రాయుడు సినిమాకు ముందు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్నారు. చేసిన సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఆయ‌న అప్పులు పాలైపోయారు. ఆ స‌మ‌యంలో మోహ‌న్‌బాబు రిక్వెస్ట్ మేర‌కు ర‌జ‌నీ ఆ సినిమాలో పాపారాయుడు పాత్ర చేశారు. సినిమా షూటింగ్ టైంలో డ‌బ్బులు కూడా లేక‌పోతే ఆ రోజుల్లోనే ర‌జ‌నీకాంత్ మోహ‌న్‌బాబుకు రు. 45 ల‌క్ష‌లు అప్పుగా ఇచ్చార‌ట‌.

Mohan Babu, Rajinikanth's 'Pedarayudu' celebrates 25 years - The Hindu

ఈ విష‌యాన్ని మోహ‌న్‌బాబు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు. అలా ఆ సినిమాకు గుండెకాయ లాంటి పాపారాయుడు పాత్ర‌లో న‌టించ‌డంతో పాటు ఏకంగా రు. 45 ల‌క్ష‌లు ఇచ్చారు. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన పెద‌రాయుడు తెలుగు సినిమా చ‌రిత్రలోనే ప్ర‌త్యేక‌మైన సినిమాగా మిగిలిపోయింది. ఎన్నో రికార్డులు తిర‌గ‌రాసి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.

Pedarayudu' completes 25 years of release: Mohan Babu shares throwback  video of the launch ceremony | Telugu Movie News - Times of India

ఆ త‌ర్వాత మోహ‌న్‌బాబు కొన్నేళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం కూడా రాలేదు. ఇక మోహ‌న్‌బాబుకు త‌మిళ్‌లో ర‌జ‌నీకాంత్‌, క‌న్న‌డ‌లో దివంగ‌త అంబ‌రీష్ తో పాటు బాలీవుడ్‌లోనూ ఎందరో సీనియ‌ర్ న‌టుల‌తో ఎంతో అనుబంధం ఉంది.