వామ్మో ఏం సౌర్య‌… వంట‌ల‌క్క‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటోందిగా…!

స్టార్ మా ఛానెల్లో ప్ర‌సారం అయ్యే వంట‌ల‌క్క సీరియ‌ల్ కార్తీక దీపం ఏ రేంజ్‌లో పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగు బుల్లితెర‌పై పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎంతో మంది ఈ సీరియ‌ల్‌కు వీరాభిమానులు. న‌ల్ల దీప అయిన వంట‌ల‌క్క‌కు ఎంత మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో డాక్ట‌ర్ బాబుకు కూడా అంతే మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియ‌ల్ చూసే వాళ్లంతా ఎప్పుడైనా వంట‌ల‌క్క‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆశ‌తో రోజుల త‌ర‌బ‌డి సీరియ‌ల్‌కు బానిస‌లుగా మారిపోయారు.

 

ఈ సీరియ‌ల్లో ఉండే ఇద్ద‌రు పిల్ల‌లలో రౌడీ శౌర్య చుట్టూనే మొన్న‌టి వ‌ర‌కు సీరియ‌ల్ క‌థంతా న‌డిచింది. ఇప్పుడు హేమ చుట్టూ క‌థ న‌డుస్తోంది. ఇక రౌడీ శౌర్య సీరియ‌ల్లోనే కాదు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ రౌడీ పిల్ల సీరియ‌ల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా వంట‌ల‌క్క‌తో బాగా ఆడుకుంటోంది. ఆమె త‌న ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్‌లో కార్తీక‌దీపం అప్‌డేట్స్ పెడుతూ నానా హంగామా చేస్తూ ఉంటుంది.

 

తాజాగా ఆమె వంట‌ల‌క్క‌తో ఆడుతోన్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తోన్న కార్తీక‌దీపం ఫ్యాన్స్ మొత్తానికి రౌడీ పిల్ల బ‌య‌ట కూడా పెద్ద అల్ల‌రి పిల్లే అని కామెంట్లు చేస్తున్నారు.