ఈ బుల్లితెర న‌టి గుర్తుందా.. యాంక‌ర్ సుమ‌కు ఏమ‌వుతుందో తెలుసా..!

తెలుగు బుల్లితెరపై ఎవ‌రిది హ‌వా అంటే అంద‌రి నోట వెంట‌నే వ‌చ్చే ఒకే ఒక ఆన్స‌ర్ యాంక‌ర్ సుమ‌. ఈ వ‌య‌స్సులో కూడా సుమ రేటింగ్‌, రేంజ్ ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. సుమ హ‌వా మామూలుగా లేదు. గ‌త ఇర‌వై ఏళ్ల‌లో తెలుగు బుల్లితెర‌పై ఎంతో మంది యాంక‌ర్లు వ‌స్తున్నారు.. వెళుతున్నారు. కానీ సుమ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ప్ర‌తి తెలుగు ఇంట్లో సుమ‌క్క‌గా సుమ పాపుల‌ర్ అయ్యింది. ఇక సుమ యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయ్యాక ఆమె ఎంతో మంది బంధువుల‌ను సైతం ఈ ఫీల్డ్‌లోకి లేదా న‌ట‌నా రంగంలోకి తీసుకువ‌చ్చింది.

 

ఈ ఫొటోలో ఉన్న ఆమె ఎవ‌రో కాదు సుమ‌కు స‌మీప బంధువే. ఆమె సుమ భ‌ర్త రాజీవ్ క‌న‌కాల‌కు చెల్లి వ‌రుస అంటే సుమ‌కు మ‌ర‌ద‌లు. ఆమె పేరు య‌‌స్వీ క‌న‌కాల‌. ఆమె అస‌లు పేరు న‌వ్య స్వామి క‌న‌కాల‌.. అయితే ముద్దుపేరు య‌శ్వి క‌న‌కాల‌తో ఇక్క‌డ పాపుల‌ర్ అయ్యింది. బుల్లితెర‌పై ప‌లు నెగిటివ్ రోల్స్‌తో ఆమె బాగా పాపుల‌ర్ అయ్యింది. య‌శ్వి బుల్లితెర‌పై ఎక్కువుగా నెగిటివ్ రోల్స్ చేస్తోంది. ఇక కార్తీక దీపం సీరియ‌ల్లో మోనిత స్నేహితురాలు శ్రీల‌త‌గా ఆమె న‌టించింది.

 

జెమినీలో ప్ర‌సారం అవుతోన్న తాళి సీరియ‌ల్లో కూడా ఆమె నెగిటివ్ రోల్లో అద‌ర‌గొట్టేసింది. జెమినీ, ఈటీవీ, జీటీవీ సీరియల్స్‌లో ఆమె ఎన్నో పాత్ర‌ల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఏదేమైనా రాజీవ్ క‌న‌కాల‌, సుమ‌కు ద‌గ్గ‌ర బంధువు అయినా వారి పేర్ల‌తో పాపుల‌ర్ కాకుండానే ఆమె త‌న ముద్ర కోసం క‌ష్ట‌ప‌డుతోంది.