అమ్మోరుతల్లిగా న‌య‌న‌తార కామెడీ… (వీడియో)

అమ్మోరు సినిమా అన‌గానే మ‌న‌కు సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ అమ్మోరు గుర్తుకు వ‌స్తుంది. అప్ప‌ట్లో ఆ సినిమా చూసిన ప్రేక్ష‌కులు చాలా మంది థియేట‌ర్ల ముందు అమ్మోరు విగ్ర‌హాలు పెట్టి పూజ‌లు చేశారు. మ‌రి కొంద‌రు ఆ సినిమాను చూసేందుకే భ‌య‌ప‌డేవారు. ఇక ఆ సినిమా ఆడిన‌న్ని రోజులు థియేట‌ర్లు దేవాల‌యాలుగా మారిపోయాయి. అమ్మోరు సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆ రేంజ్‌లో ప్ర‌భావితం చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఆ త‌ర్వాత అదే భ‌క్తి ప్ర‌ధాన పాత్ర‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చినా అవేవి ఆ స్థాయిలో ప్ర‌భావితం చేయ‌లేక‌పోయాయి.

 

చాలా యేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అమ్మోరు సినిమా వ‌స్తోంది. లేడీ అమితాబ‌చ్చ‌న్ న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో కోలీవుడ్‌లో మూకుత్తి అమ్మన్ సినిమా వ‌స్తోంది. ఈ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో రిలీజ్ చేస్తున్నారు. న‌య‌న‌తార అమ్మోరు త‌ల్లిగా న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ చూస్తుంటే భ‌క్తుడి క‌ష్టాలు తీర్చేందుకు అమ్మోరు త‌ల్లి భూమి మీద‌కు వ‌స్తుంది. ఆ త‌ర్వాత దొంగ బాబాల ముసుగులో ప్ర‌జ‌ల‌ను మోసం చేసేవారి భ‌ర‌తం ప‌ట్టేందుకు రెడీ అవుతుంది.

 

అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌ను బట్టి చూస్తే ఇందులో సీరియ‌స్ నెస్ క‌న్నా కామెడీకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అమ్మోరు తరహా సీరియస్‌నెస్ ఎక్కడా లేదు. చాలా కామెడీగా ఉన్న ఈ సినిమా వ‌చ్చే దీపావ‌ళి కానుక‌గా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ కానుంది.