సీనియర్ హీరో నాగార్జున, మరో సీనియర్ నటుడు నాగబాబు ఇద్దరు కూడా బుల్లితెరపై ఇప్పుడు టాప్ ప్రోగ్రామ్‌లను హోస్ట్ చేస్తున్నారు. ఈటీవీలో సూపర్ పాపులర్ షో జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు అక్కడ టీంను అంతా బయటకు రప్పించి మరీ జీ టీవీలో బొమ్మ అదిరింది షో స్టార్ట్ చేశాడు. పైగా ఇప్పుడు పాత యాంకర్లను తీసేసి టాప్ పాపులర్ యాంకర్ శ్రీముఖిని యాంకర్‌గా తీసుకున్నారు. పైగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేయడంతో కావాల్సినంత రచ్చ క్రియేట్ అయ్యింది.
ఇంత జరిగినా ఈ ప్రోగ్రామ్‌కు వచ్చిన రేటింగ్ కేవలం 3.75. మరో వైపు స్టార్ మాలో వస్తోన్న బుల్లితెర బ్లాక్‌బస్టర్ కార్తీకదీపంకు వచ్చిన రేటింగ్ 18. దీనిని బట్టి ఈ షోను జనాలు ఎంత లైట్ తీస్కొంటున్నారో చెప్పేస్తోంది. మరోవైపు నాగబాబు వెకిలీ నవ్వులు.. పసలేని స్కిట్లు కూడా ఈ షో ప్లాప్‌కు కారణాలే. మరోవైపు బిగ్‌బాస్ నాగార్జున ఎంత కొరడా పట్టుకుని ఉరుముతున్నా.. 8-9 కోట్లో ఓట్లు అని చెప్పుకుంటున్నా… అవన్నీ వాళ్లల్లో వాళ్లు ముసిరిపోవడానికే తప్పా ఎందుకు ఉపయోగం లేదని చెప్పేస్తున్నాయి.
చివరకు నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్లకు కూడా రేటింగ్ 7 – 7.5 దాటడం లేదు. మామూలు రోజుల్లో అయితే బిగ్‌బాస్ రేటింగ్ మరీ దారుణంగా 3-4 రేటింగులతో సరి పెట్టుకుంటోంది. పసలేని టాస్క్‌లు, చూడడానికి ఏ మాత్రం ఆసక్తిలేని కంటెస్టెంట్ల ముష్టియుద్ధాలతో బిగ్‌బాస్ 4 కొట్టేస్తోంది.