Moviesవామ్మో అంత రేటింగా... రికార్డులు బ‌ద్దలు కొట్టిన వంట‌ల‌క్క

వామ్మో అంత రేటింగా… రికార్డులు బ‌ద్దలు కొట్టిన వంట‌ల‌క్క

బుల్లితెర పాపుల‌ర్ షో స్టార్ మా సీరియ‌ల్ కార్తీక‌దీపం మ‌రోసారి రికార్డు టీఆర్పీల‌తో రికార్డులు బ‌ద్దలు కొడుతోంది. గ‌త వారం ఆ సీరియ‌ల్‌కు ఏకంగా 18 టీఆర్పీ వ‌చ్చింది. మిగిలిన పాపుల‌ర్ సీరియల్స్ ఏవీ కూడా దానికి ద‌రిదాపుల్లో కూడా లేవు. ఈ సీరియ‌ల్ మాత్ర‌మే కాకుండా గృహ‌లక్ష్మి క‌స్తూరి, వ‌దిన‌మ్మ సుజాత‌కు తోడుగా కొత్త‌గా దేవ‌త సుహాసిని, చెల్లిలి కాపురం భూమి అలియాస్ శిరీష లాంటి సీరియ‌ల్స్ రావ‌డంతో అస‌లు టాప్ – 30 ప్రోగ్రామ్స్ నుంచి మ‌రో ఛానెల్ పేరు లేకుండా అంద‌రిని బ‌య‌ట‌కు తోసేసింది స్టార్ మా ఛానెల్‌.

 

ఇక ఈటీవీలో ఒక విశేషం ఏంటంటే ఆలీ, మంజు భార్గ‌వి చేస్తోన్న య‌మ‌లీల సీరియ‌ల్ మెల్ల‌మెల్ల‌గా పిక‌ప్ అవుతోంది. ఇక జీ తెలుగులో ఎంత మంచి సీరియ‌ల్స్ ఉన్నా ఎందుకో ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌ట్లేదు. త్రిన‌యిని, ప్రేమ ఎంత మ‌ధురం, క‌ల్యాణ వైభోగ‌మే, రాధ‌మ్మ కూతురు లాంటి సీరియల్స్ మంచివే. ఇందులో ఏ ఒక్క‌టి ఆరున్న‌ర రేటింగ్ కూడా దాట‌డం లేదు.

 

 

మరోవైప స్టార్ మా లో కార్తీక‌దీపం ఒక్క‌టే 18 రేటింగ్ దాటుతోంది. ఇక మిగిలిన వాటిలో వ‌దిన‌మ్మ‌, గృహ‌ల‌క్ష్మి ప‌ది రేటింగ్ దాటేస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన సీరియ‌ల్స్ కూడా 7 వ‌ర‌కు లాగేస్తున్నాయి. ఈ  లెక్క‌న స్టార్ మాకు అస‌లు పోటీ ఇచ్చే ఒక్క సీరియ‌ల్ కూడా ఏ ఛానెల్లోనూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news