రాజమౌళి సినిమా అంటే లెక్కలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఓ సినిమా తీయాలంటే రాజమౌళి ఒక్కో సినిమాను చెక్కుకుంటూ వెళతాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రాజమౌళి ప్రధాన బలం యాక్షన్ సీన్లే అంటున్నారు. మాస్ నాడి పట్టుకోవడంలో రాజమౌళికి మించిన దర్శకుడు ఉండడు. బాహుబలి 1,2లలో కథ, కథనాలతో పాటు అదిరిపోయే, కళ్లు చెదిరే యాక్షన్ కూడా ఉంది.
ఇక హీరోయిజం బాగా ఎలివేట్ చేసే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నాడట. రాజమౌళి యాక్షన్ సీన్లు, యుద్ధాలు ఎలా ఎలివేట్ చేస్తాడో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌లో కొమరం భీం, అల్లూరి ఇద్దరు పాత్రలకు వచ్చే యుద్ధాలే కాకుండా, మామూలు యాక్షన్ సీన్లు కూడా ఓరేంజ్‌లో డిజైన్ చేశాడని టాక్ వచ్చేసింది.
అసలు రాజమౌళి యాక్షన్ సీన్లు ఎలా ఉంటాయో సింహాద్రి, విక్రమార్కుడు, ఛత్రపతి సినిమాలే నిదర్శనం. రాజమౌళి టేకింగ్‌కు తోడు.. ఇద్దరు బడా స్టార్ హీరోలు.. పైగా ఇద్దరికి యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఇవన్నీ చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి డౌట్లు అక్కర్లేదేమో..?