బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం..!

తెలంగాణ‌లో ఇటీవ‌ల మావోల క‌ద‌లిక‌లు తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణం కావ‌డంతో పాటు పోలీసుల‌కు స‌వాల్ విసురుతున్నాయి. తాజాగా ఆదివారం తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మంగ‌పేట అట‌వీ ప్రాంతంలోని ముస‌ల‌మ్మ‌గుట్ట వ‌ద్ద ఈ కాల్పులు జ‌రిగాయి. ఈ క్ర‌మంలోనే పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు జ‌ర‌గ‌గా ఇద్ద‌రు మావోయిస్టులు హ‌త‌మైన‌ట్టు తెలుస్తోంది.

 

ఆదివారం పోలీసులు కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా వారికి మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల మృతిని పోలీసులు ధృవీక‌రించాల్సి ఉంది.