హీరో అధ‌ర్వ పెళ్లి… ఆ అమ్మాయితోనే డేటింగ్..!

లాక్‌డౌన్ వేళ వ‌రుస‌గా హీరోలు పెళ్లి పీట‌లు ఎక్కేస్తున్నారు. మ‌న తెలుగులోనే రానా, నిఖిల్‌, నితిన్‌, నిర్మాత దిల్ రాజు ( రెండో పెళ్లి) వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక మెగాడాట‌ర్ నిహారిక సైతం త్వ‌ర‌లోనే జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ను పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ లిస్టులోకే ఇప్పుడు మ‌రో కోలీవుడ్ హీరో చేరాడు. కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

 

గోవాకు చెందిన ఓ అమ్మాయితో అధ‌ర్వ కొద్ది రోజులుగా రిలేష‌న్ షిప్‌లో ఉన్నాడ‌ని తెలుస్తుండ‌గా.. ఇప్పుడు ఆ అమ్మాయితోనే అధర్వ మూడు ముళ్లు వేసి.. ఏడు అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. ఇక అధ‌ర్వ్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాతో ప‌రిచ‌య‌మే.

 

ఇక అధ‌ర్వ ప్ర‌స్తుతం త‌ల్లి పొగ‌తె సినిమా ప్ర‌క‌టించాడు. ఈ సినిమా నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన నిన్ను కోరి సినిమాకు రీమేక్‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అమితాష్ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే అనుప‌మ త‌మిళ్ సినిమాకు ఎంట్రీ ఇస్తోంది.