మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తాను నిర్మాతగా తన తండ్రి చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆచార్యలో చరణ్ ఓ కేమియో రోల్ చేస్తున్నాడట. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు చాలా వరకు కంప్లీట్ అవ్వడంతో చరణ్ తన నెక్ట్స్ సినిమాలు లైన్లో పెట్టేందుకు వరుసగా కథలు వింటున్నాడట.
ఈ క్రమంలోనే ఛలో, భీష్మ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలతో మంచి స్వింగ్‌లో ఉన్న వెంకీ కుడుముల కూడా చరణ్‌కు ఓ కథ చెప్పాడట. చరణ్ణు దృష్టిలో పెట్టుకుని వెంకీ రెడీ చేసిన కథ విన్న చరణ్ ఆ కథ నాకు సూట్ కాదని.. నేను చేయలేనని చెప్పేశాడట. ఏదేమైనా ప్రస్తుతం వెంకీ కుడుములతో చేసేందుకు యంగ్ హీరోలు రెడీగా ఉన్నారు.
ఇలాంటి టైంలో వెంకీ చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీని చరణ్ రిజెక్ట్ చేయండి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.