ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభమైంది. గతంతో పోలిస్తే ఈ సారి చెన్నై లాంటి అంచనాలు ఉన్న జట్టు రేసులో వెనకపడిపోతోంది. గత సీజన్ల కంటే ఈ సారి భిన్నంగా ఐపీఎల్ జరుగుతోందని మ్యాచ్‌ల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఏడు సిక్సులు బాదాడు.
ఈ మూడు సిక్సులు వరుసగా 100, 105, 106 వంద మీటర్లు దాటాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు సిక్సులు అది కూడా వందమీటర్లు దాటించిన ఆటగాడిగా పూరన్ రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో పాటు ఈ సీజన్లో భారీ సిక్సు 106 మీటర్లు బాదిన రికార్డు కూడా పూరన్‌పేరు మీదే ఉంది. భారీ సిక్సర్లు బాదడంలో పూరన్ తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటున్నాడు.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఇచ్చిన 201 పరుగులు భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పూరన్ ఒక్కడే 27 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాడు.