త్రివిక్ర‌మ్ రాంగ్ గైడెన్స్‌తో రాంగ్ ట్రాక్‌లో ప‌వ‌న్‌…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి అనుబంధం సినిమాల వ‌ర‌కే కాదు.. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఎక్కువ‌గానే ఉంటుంది. వీరి కాంబోలో మూడు సినిమాలు వ‌చ్చాయి. బ‌య‌ట ద‌ర్శ‌కులతో ప‌వ‌న్ చేసే సినిమాల్లో కూడా త్రివిక్ర‌మ్ ఇన్వాల్‌మెంట్ ఎంతోకొంత ఉంటుంది. త్రివిక్ర‌మ్ ఇన్‌ఫుట్స్ ఖ‌చ్చితంగా ఉంటాయి.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ నుంచి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప‌వ‌న్ అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍లో నటిస్తున్నాడన్న వార్త అభిమానుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. పైగా కొత్త ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌తో సినిమా అంటే ప‌వ‌న్ అభిమానుల‌కు ఆందోళ‌న మామూలుగా లేదు. అసలు ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్‌లో న‌టించ‌డ‌మే ఫ్యాన్స్‌కు న‌చ్చ‌డం లేదు. పైగా ఇప్పుడు సాగ‌ర్ చంద్ర‌తో సినిమా అంటే వాళ్లు డిజప్పాయింట్‌లో ఉన్నారు.

ప‌వ‌న్‌ను పింక్ సినిమా చేసేలా ప్రోత్స‌హించిందే త్రివిక్ర‌మ్ అట‌. ఇక ఇప్పుడు అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍ చేయడానికి ప‌వ‌న్‌ను ఎంక‌రేజ్ చేసింది కూడా త్రివిక్ర‌మే అట‌. సితార వాళ్ల‌తో ఉన్న అనుబంధంతోనే త్రివిక్ర‌మ్ ఈ రీమేక్‌లో ప‌వ‌న్ న‌టించేలా ప్రోత్స‌హించాడ‌ట‌. ఏదేమైనా అజ్ఞాత‌వాసి లాంటి ప్లాప్‌ల త‌ర్వాత త్రివిక్ర‌మ్‌తో వ‌రుస‌గా రీమేక్ సినిమాలు.. అది కూడా ఇత‌ర భాష‌ల్లోనే పెద్ద‌గా అంచ‌నాలు లేని క‌థ‌ల‌తో ఇరికించేస్తున్నాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.