మెస్ట్ ఎలిజి‌బుల్ బ్యాచిల‌ర్ టీజ‌ర్ దెబ్బ‌కే టెన్ష‌న్… వామ్మో అఖిల్‌ను దేవుడే కాపాడాలి..!

అక్కినేని కుర్రాడు అఖిల్ హీరో అయ్యి మూడు సినిమాలు చేసినా ఏ ఒక్క‌టి హిట్ అవ్వ‌లేదు. అఖిల్ – హ‌లో – మిస్ట‌ర్ మ‌జ్ను మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అఖిల్‌కు హిట్ రాక‌పోవ‌డంతో నాగార్జున సైతం పూర్తిగా నిరాశ‌లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు నాలుగో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సితో రెడీ అవుతున్నారు. అల్లు అర‌వింద్ నిర్మాణ సార‌థ్యం.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.

 

 

అర‌వింద్ బ‌డ్జెట్ విష‌యంలో కాస్త వెన‌క‌డుగు వేసినా కూడా నాగార్జున ఒత్తిడి చేసి ఖ‌ర్చు పెట్టిస్తున్నాడు. అందుకే పూజా హెగ్డే విష‌యంలో అర‌వింద్ వెన‌క్కు త‌గ్గినా నాగ్ , అఖిల్ ప‌ట్టుబ‌ట్టి ఆమెనే హీరోయిన్‌గా తీసుకునే వ‌ర‌కు వ‌ద‌ల్లేదు. తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్‌పై అక్కినేని వీరాభిమానుల నుంచే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. బొమ్మ‌రిల్లు త‌ర‌హాలోనే సీన్లు ఉన్నాయ‌ని.. కొత్త‌ద‌నం లేద‌ని అంటున్నారు.

 

బొమ్మ‌రిల్లు త‌ర్వాత భాస్క‌ర్‌కు హిట్ లేదు. ఇప్ప‌డు ఏ మాత్రం ఫామ్‌లో లేని భాస్క‌ర్‌ను న‌మ్ముకుని అఖిల్ ఉన్నాడు. మొత్తానికి టీజ‌ర్లో అయితే కొత్త‌గా ఏం లేద‌నే అంటున్నారు. మ‌రి అఖిల్‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హిట్ రాక‌పోతే కెరీర్ ఘోరంగా దెబ్బ‌తింటుంది. అఖిల్‌ను మ‌రి ఆ దేవుడే కాపాడాలి.