Moviesవెంక‌టేష్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ అయిన ఐశ్వ‌ర్యారాయ్‌... !

వెంక‌టేష్ హిట్ సినిమాలో ఛాన్స్ మిస్ అయిన ఐశ్వ‌ర్యారాయ్‌… !

విక్ట‌రీ వెంక‌టేష్ – అంజ‌లా ఝ‌వేరీ జంట‌గా జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో 1997లో వ‌చ్చిన ప్రేమించుకుందాం రా సినిమా ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స‌మ‌రసింహారెడ్డి కంటే ముందే వ‌చ్చిన ఫ్యాక్ష‌న్ సినిమాగా ఇది నిలిచింది. ల‌వ్, ఫ్యాక్ష‌న్ అంశాల నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అయితే ఈ సినిమాలో వెంకీకి జోడీగా ఐశ్వ‌ర్యారాయ్ హీరోయిన్‌గా న‌టించాలి. ఆమె అప్ప‌టికే ప్ర‌పంచ సుంద‌రి అయినా ఆమె న‌టించిన రెండు, మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

 

దీంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ఒప్పుకోలేద‌ట‌. దీంతో చివ‌ర‌కు అంజ‌లా ఝ‌వేరిని హీరోయిన్‌గా తీసుకున్నారు. సినిమా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న ఐశ్వ‌ర్య‌ను ప్రేమించుకుందాం రా యూనిట్ ప‌క్క‌న పెట్టినా ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌లో వ‌రుస హిట్ల‌తో తిరుగులేని స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె సౌత్‌లో మ‌ళ్లీ హీరోయిన్ అవ‌కాశాలు ద‌క్కించుకుని బ్లాక్ బస్ట‌ర్ హిట్లు కొట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news