Moviesబెయిల్‌పై ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌ళ్లీ అరెస్ట్‌... నూత‌న్ నాయుడు భార్య...

బెయిల్‌పై ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి మ‌ళ్లీ అరెస్ట్‌… నూత‌న్ నాయుడు భార్య కొత్త లీల‌లు

విశాఖ‌లోని పెందుర్తిలో ఓ దళిత యువకుడికి శిరోముండనం కేసులో అరెస్టు అయిన జ‌బ‌ర్ద‌స్త్ కంటెస్టెంట్‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, సినీ నిర్మాత నూత‌న్ నాయుడు భార్య మ‌ధుప్రియ బెయిల్‌పై ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చారో లేదో మ‌ళ్లీ వెంట‌నే అరెస్టు అయ్యారు. మ‌ధుప్రియ బెయిల్‌పై బ‌య‌ట‌కు రాగా తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ త‌న వ‌ద్ద ఆమె రు. 25 ల‌క్ష‌లు వ‌సూలు చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆమె అలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో వెంట‌నే మ‌ళ్లీ అరెస్టు చేశారు. దీంతో కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఇక ఆగ‌స్టు 28న మ‌ధుప్రియ త‌న ఇంట్లో ప‌నిమానేసిన ద‌ళిత యువ‌కుడు శ్రీకాంత్‌కు బ‌ల‌వంతంగా శిరోముండ‌నం చేయించ‌డంపై అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Nutan Naidu's Wife Madhu Priya Released, Arrested Again | Gulte - Latest  Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews,  Analysis, Photos

ద‌ళిత సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. దీంతో మ‌ధుప్రియ‌తో పాటు ఆమెకు స‌హ‌క‌రించిన వారు అంద‌రిని అరెస్టు చేశారు. ప‌రారీలో ఉన్న నూత‌న్ నాయుడుఉ క‌ర్నాట‌క‌లోని ఉడిపిలో అరెస్టు చేసిన పోలీసులు వైజాగ్ తీసుకువ‌చ్చారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news