ప్ర‌గ‌తి ఆంటీతో నితిన్‌… రెడ్ డ్రెస్సులో అబ్బో చంపేశారుగా…

తెలుగు సినిమాల్లో పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో ప్ర‌గతి ఆంటీ ఒక‌రు. ఎఫ్ 2 లాంటి సినిమాల్లో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కు అత్త‌గా న‌టించినా ప్ర‌గ‌తి ఆంటీ ఈ వ‌య‌స్సులో కూడా జిమ్‌లో టాప్‌లేపే వ‌ర్క‌వుట్ల‌తో మంచి ఫిజిక్‌, ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తుంటుంది. ప్ర‌గ‌తి ఆంటీ వ‌ర్క‌వుట్లు చూస్తే ఆమె ఈ వ‌య‌స్సులో కూడా అందంలో హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోద‌నే చెప్పాలి. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ త‌న హాట్ ఫిట్‌నెస్ ఫొటోల‌తో యాక్టివ్‌గా ఉండే ప్ర‌గ‌తి ఆంటీ రెగ్యుల‌ర్‌గా త‌న జిమ్ వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

 

తాజ‌గా ప్ర‌గ‌తి త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో నితిన్‌తో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఇద్దరు రెడ్ ఔట్ ఫిట్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అస‌లు ఏ మాత్రం ఏమ‌రుపాటుగా చూసినా నితిన్ ప‌క్క‌న రెడ్ డ్రెస్సులో ఉన్న ప్ర‌గ‌తిని చూసి హీరోయినా ? అనుకునేంత అందంగా ప్ర‌గ‌తి ఉంది. అయితే ఈ ఫొటో ఇద్ద‌రూ క‌లిసి ఎప్పుడు దిగారు అన్న విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు.

 

అయితే అభిమానులు మాత్రం రంగ్ దే మూవీ స‌మ‌యంలో వీరిద్ద‌రు క‌లిసి ప‌క్క ప‌క్క‌నే ఉండి ఇచ్చిన స్టిల్ అయ్యి ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. మరి కొందరు ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో సన్నివేశంకు సంబంధించిన ఫోటో అని అంటున్నారు. ఏదేమైనా ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌గా.. ప్ర‌గ‌తి ఆంటీని చూసి కెవ్వు కేక అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.