Moviesబిగ్‌బాస్ నుంచి గంగ‌వ్వ అవుట్‌... రెండు ట్విస్టులకు ఆన్స‌ర్ దొరికేసింది..

బిగ్‌బాస్ నుంచి గంగ‌వ్వ అవుట్‌… రెండు ట్విస్టులకు ఆన్స‌ర్ దొరికేసింది..

యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన గంగవ్వ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఆమె ఓ రేంజ్లో పాపుల‌ర్ అయ్యింది. ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా ఆమె యంగ్ కంటెస్టెంట్ల‌తో పోటీ ప‌డుతూ హౌస్‌లో ఉండ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఐదు వారాల పాటు హౌస్‌లో ఉన్న గంగ‌వ్వ త‌న మాట‌ల‌తో కంటెస్టెంట్ల‌ను మెప్పించ‌డంతో పాటు ఇటు బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌ను కూడా మెప్పించింది.

 

ఇక అనారోగ్యంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌లేన‌ని నాగార్జున‌కు చెప్ప‌డంతో ఆమె కోరిక మేర‌కు ఆమెను హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన గంగ‌వ్వ‌ను స్టేజ్‌మీద‌కు పిలిచిన నాగార్జున ఆమె ఏ ఆశ‌యంతో అయితే హౌస్‌లోకి వ‌చ్చిందో ఆ కోరిక తీర్చేస్తామ‌ని హామీ ఇచ్చాడు. నీకు ఇల్లు కావాల‌ని బిగ్‌బాస్ హౌస్‌కు వ‌చ్చావు.. నీ ఆశ‌యం తీరుతుంది.. నీకు ఇల్లు క‌ట్టించే బాధ్య‌త నాది.. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ల‌మ‌ని చెప్పేశాడు.

 

నాగ్ ఇచ్చిన ఇంటి హామీతో ఫుల్ ఖుషీ అయిన గంగ‌వ్వ త‌న‌కు ఎంతో ఇష్టం అయిన అఖిల్‌ను సేవ్ చేసింది. ఇక నామినేష‌న్ల‌లో ఉన్న వాళ్ల‌లో సోహైల్ ఇప్ప‌టికే సేవ్ అయ్యాడంటూ నాగార్జున అంత‌కు ముందే ప్ర‌క‌టించాడు. ఏదేమైనా గంగ‌వ్వ బ‌య‌ట‌కు వెళ్లే క్ర‌మంలో రెండు మంచి ప‌నులు జ‌రిగాయి. ఒక‌టి ఆమె ఇంటి కోరిక‌ను నాగ్ తీర్చేశాడు. రెండు ఆమె కంటెస్టెంట్ల‌కు షాక్ ఇస్తూ అఖిల్‌ను సేవ్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news