మ‌రోసారి మెగా వ‌ర్సెస్ నంద‌మూరి వార్‌… టాలీవుడ్‌లో ఒక్క‌టే హాట్ టాపిక్‌..!

టాలీవుడ్ స్టార్ హీరోలు, వారి అభిమానులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వ్యూస్‌, లైక్స్‌, ఇత‌ర రికార్డుల వేట‌లో ఉన్నారు. త‌మ అభిమాన హీరోల విష‌యాల‌ను ట్విట్ట‌ర్‌లోనో లేదా యూట్యూబ్‌లోనో ట్రెండ్ అయ్యేలా చేసేందుకు త‌మ వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇక మెగా – నంద‌మూరి అభిమానుల వార్ అంటే ఏ రేంజ్‌లో ఇండ‌స్ట్రీని హీటెక్కిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

గ‌తంలో ఎన్నోసార్లు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి చేసి బాక్సాఫీస్‌ను హీటెక్కించేవి. ఇప్పుడు ద‌స‌రా కానుక‌గా మ‌రోసారి మెగా, నంద‌మూరి అభిమానుల సోష‌ల్ వార్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. నంద‌మూరి అభిమానుల కోసం రాజ‌మౌళి రామరాజు ఫర్ భీమ్ వీడియోను ఈనెల 22న విడుదల చేస్తున్నాడు.

 

నంద‌మూరి అభిమానులు ఇప్ప‌టికే ట్విట్ట‌ర్‌లో అత్య‌ధిక ట్వీట్స్ చేయ‌డంతో పాటు యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్ మిలియ‌న్ వ్యూస్‌, లైక్స్ రికార్డులు రాబ‌ట్టి ఎన్టీఆర్‌కు ద‌స‌రా కానుక ఇవ్వాల‌ని ప్లాన్లు వేస్తున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ కూడా ద‌స‌రాకే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

 

ఆ టీజ‌ర్ కూడా ద‌స‌రాకే వ‌స్తే ఈ టీజ‌ర్‌ను కూడా మోత మోగించాల‌ని మెగా అభిమానులు భావిస్తున్నారు. మ‌రి మెగా, నంద‌మూరి హీరోల టీజ‌ర్ల‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ?  చూడాలి. ప్ర‌స్తుతం ఈ రెండు టీజ‌ర్ల మ్యాట‌ర్ టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.