బ్రేకింగ్‌:  రోజాకు బిగ్‌ షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. రోజాకు సీఎం జ‌గ‌న్ దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలోనే రోజాకు వ్య‌తిరేకంగా గ్రూపు క‌ట్టి న‌డుపుతోన్న మాజీ మునిసిప‌ల్ చైర్మ‌న్ కెజె. కుమార్ భార్య కేజె. శాంతికి ఈడిగ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. కెజె. కుమార్‌, కెజె.శాంతి ఇద్ద‌రు గ‌తంలో మునిసిప‌ల్ చైర్మ‌న్లుగా ప‌నిచేశారు. కొద్ది రోజులుగా ఈ రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ‌ల‌తో న‌గ‌రి వైసీపీ రాజ‌కీయం హీటెక్కుతోంది.

 

కెజె.కుమార్ గ్రూప్‌న‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డితో పాటు మ‌రో మంత్రి నారాయ‌ణ స్వామి అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్నాయ‌ని స్థానికంగా ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. ఎవ‌రిని అయితే రోజా తీవ్రంగా వ్య‌తిరేకిస్తుందో అదే వ‌ర్గం నేత‌కు ఆమెకు ఇష్టంలేక‌పోయినా రాష్ట్ర స్థాయి ప‌ద‌వి రావ‌డాన్ని బ‌ట్టి చూస్తే రోజాకు ఇది రాజ‌కీయంగా పెద్ద షాకే అని చెప్పాలి.