అమ్మ రాజ‌శేఖ‌ర్ అర్ధ శిరోముండ‌నం.. గుక్క‌ప‌ట్టి ఏడ్చిన లేడీ కంటెస్టెంట్‌

బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం రోజు అమ్మ రాజశేఖర్ స‌గం గుండు చేయించుకోవ‌డం బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌నే కాకుండా వీక్ష‌కుల‌ను సైతం షాక్‌కు గురి చేసింది. అమితుమీ టాస్క్‌లో ఈ డీల్ వ‌ద్ద‌నుకున్న రాజ‌శేఖ‌ర్ నాగార్జున అడ‌గ‌గానే వెంట‌నే స‌గం గుండు చేయించుకున్నాడు. వ‌చ్చే వారం నామినేష‌న్ నుంచి సేఫ్ అయ్యే ఛాన్స్ ఇస్తాను ?  బ్లూ టీంలో ఎవ‌రు అర‌గుండు చేయించుకుంటారో ఒక్క నిమిషంలో చెప్పాల‌ని అడ‌గ‌గా వెంట‌నే రాజ‌శేఖ‌ర్ ఓకే చెప్పాడు.

 

చివ‌ర‌కు నోయ‌ల్ ట్రిమ్మ‌ర్‌తో రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు అర గుండు గీశాడు. అప్పుడు హౌస్‌లో అంద‌రు స‌భ్యులు కాస్త ఎమోష‌న‌ల్ అయ్యారు. రాజ‌శేఖ‌ర్ బాత్ రూంలోకి వెళ్లి ఏడ్చేశాడు. నాగ్ స‌ర్ అడిగిన‌ప్పుడు నో చెప్ప‌వ‌చ్చు క‌దా ? అని దివి వాపోయింది. జీవితంలో ఎంతో పోయింది.. ఇది ఓ లెక్క కాదు… తాను గ్రేట్ కోసం ఇవ్వ‌లేద‌ని.. దేవుడికి ఇచ్చాన‌ని మాస్ట‌ర్ చెప్పారు.

 

అయితే రాజ‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నాల‌ను ఇంటి స‌భ్యుల‌తో పాటు నాగ్ కూడా అభినందించాడు. అమ్మ కోసం చేయింది కూడా గేమ్ కోసం చూశావు. క‌ళ‌ల‌కు రూపం న‌ట‌రాజు.. ఆయ‌న రూపం అర్ధ‌నారీశ్వ‌ర రూపం అంటూ నాగ్ రాజ‌శేఖ‌ర్‌ను మెచ్చుకున్నారు. ఇక అర‌గుండుతో డిస్ట‌ర్బ్ అయ్యావు క‌ద‌మ్మా అని బాధ‌ప‌డుతోన్న దివిని సైతం నాగ్ ఓదార్చాడు. పూర్తి గుండు చేసుకోమంటే ప‌ర్లేదు కాని.. అర్థ గుండు రైట్ కాద‌ని ఆమె చెప్పింది.