త‌ప్పతాగి రోడ్డుపైనే హీరోయిన్ ర‌చ్చ… పోలీసుల‌తోనూ గొడ‌వ‌..!

కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ త‌ప్ప‌తాగి అర్ధ‌రాత్రి స‌మ‌యంలో త‌న కారుతో చెన్నై న‌డిరోడ్ల‌పై ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఆమె కారును అటూ ఇటూ తిప్పుతూ పోనిస్తుండ‌డంతో ఆమె ఎక్క‌డ యాక్సిడెంట్ చేస్తుందో ? అని భ‌య‌ప‌డ్డ పోలీసులు ఆమె కారును ఆపితే పోలీసుల‌తోనూ గొడ‌వ‌కు దిగింది. చివ‌రు ఆమె కారులోనుంచి బ‌య‌ట‌కు దిగి ఊగుతూ.. తూలుతూ డ్యాన్స్ చేస్తుండ‌డంతో రోడ్ల‌పై ఉన్న ప్ర‌జ‌లు ఆమెను చూసి షాక్ అయ్యారు. ఆమె ప‌లు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేసిన న‌టి అని గుర్తించారు.

 

అంద‌రూ ఆమెను చోద్యం చూస్తుండ‌డంతో అక్క‌డ ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివ‌ర‌కు పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి ఆమెను పంపేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆమె పోలీసుల‌తోనూ గొడ‌వ‌కు దిగింది. చివ‌ర‌కు ఆమె వెహిక‌ల్‌తో స‌హా పోలీసులు ఆమెను స్టేష‌న్‌కు తీసుకువెళ్లి ఆమె మ‌త్తుదిగాక విచారించారు. ముందు ఆమెకు రు. 10 వేల జ‌రిమానా వేయ‌గా.. ఆ న‌టి తాను విస్కీ తాగ‌లేద‌ని.. కేవలం బీర్ మాత్ర‌మే తాగాన‌ని చెప్పింది.

 

ఆమె ఓ నైట్ పార్టీకి వెళ్లిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది. పైగా నేను ఒక్క‌దాన్నే తాగి డ్రైవ్ చేస్తున్నానా ?  నాపైనే ఎందుకు కేసు పెట్టారంటూ స్టేష‌న్లో నానా హంగామా చేసింది. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పోలీసులు ఆమె కారును స్వాధీనం చేసుకోగా.. చివ‌ర‌కు ఓ రాజ‌కీయ నేత వ‌చ్చి ఆమెను బెయిల్‌పై విడిపించుకుని వెళ్లాడు. ప్ర‌స్తుతం ఈ విష‌యం కోలీవుడ్ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతోంది.