తెలుగులో పాత తరం హీరోయిన్ అయిన సహజనటి జయసుథ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చాలా మంది సీనియర్ హీరోల పక్కన నటించింది. జయసుధ అద్భుతమైన నటనే ఆమెకు సొంతం. ప్రస్తుతం వయస్సు పైబడడంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు పరిచయం అయ్యింది. అమ్మ, వదిన, అత్త, అక్క పాత్రల్లో నటిస్తోంది. జయసుధ పలు యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూల్లో గతంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే జయసుధ తాను గతంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది.
అయితే ఆ వయస్సులో ప్రతి అమ్మాయికి ఈ తరహా కోరికలు ఉంటాయని.. ఇది సహజమే అని చెప్పింది. అలాగే హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ సింగర్‌ను కూడా తాను అప్పట్లో పెళ్లి చేసుకోవాలని కలలు కనేదానిని అని.. అయితే కొంత కాలానికి అతడు నపుంసకుడు అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యానని కూడా చెప్పింది. జయసుధ తమ సినిమాలో ఉందంటే చాలు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లే నటనలో చిన్న తప్పు కూడా చేయకూడదని.. రెండో టేక్ తీసుకోకూడదని భావించేవారట.
జయసుధ భర్త నితిన్‌కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జయసుధ తన కుమారులతో కలిసి హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. ఇక రాజకీయంగా ఆమె 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్న ఆమె గత ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.