Moviesఆ హీరోయిన్‌తో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లా... ఎవ‌రా హీరోయిన్‌..!

ఆ హీరోయిన్‌తో యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లా… ఎవ‌రా హీరోయిన్‌..!

ప్ర‌స్తుతం అంతా సోష‌ల్ మీడియా మ‌యం కావ‌డంతో ఎవ‌రికి సెల‌బ్రిటీల గురించి ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు ఏదో ఒక‌టి రాసేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వ‌ర్థ‌మాన హీరోయిన్‌తో పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు పెళ్లంటూ వార్త‌లు రావ‌డంతో స‌ద‌రు హీరోయిన్ చిన్న‌బుచ్చుకుంది. షార్ట్ ఫిల్మ్స్‌తో పాపుల‌ర్ అయిన వ‌ర్థ‌మాన హీరోయిన్ జ్ఞానేశ్వ‌రి ఆ త‌ర్వాత పెళ్లిచూపులు -2తో మంచి పాపుల‌ర్ అయ్యింది. ఈ షోలో ఆమె విజేత‌గా కూడా నిలిచింది.

Thanu: A Short Film in Telugu by Prudhvi | FunBuzzTime.com

అయితే పెళ్లిచూపులు – 2కు యాంక‌ర్‌గా ప్ర‌దీప్ వ్య‌వ‌హ‌రించాడు. దీంతో కొంద‌రు గాసిప్ రాయుళ్లు ప్ర‌దీప్, జ్ఞానేశ్వ‌రిని పెళ్లాడుతున్నాడంటూ ర‌క‌ర‌కాల వార్తు వ‌డ్డించేశారు. ఈ వార్త‌ల‌పై ఆమె త‌న తాజా ఇంట‌ర్వ్యూల తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప్ర‌దీప్ సౌత్ ఇండియాలోనే మంచి పాపుల‌ర్ యాక్ట‌ర్ అని.. అత‌డి గౌర‌వ ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆమె వాపోయింది.

Thanu: A Short Film in Telugu by Prudhvi | FunBuzzTime.com

తాము కేవ‌లం పెళ్లిచూపులు 2లో క‌లిసి ప‌నిచేశామ‌ని.. అంత మాత్రాన తాము ప్రేమ‌లో ప‌డిపోయామ‌ని.. పెళ్లి చేసుకుంటామ‌ని అనుకోవ‌డం పొర‌పాటు అని చెప్పింది. ఇదిలా ఉంటే తెలుగులో జ్ఞానేశ్వ‌రి న‌టించిన పీఎస్‌, పీకే, మిస్ట‌ర్ అండ్ మిసెస్‌, త‌ను, ఒక ల‌వ్ జంట త‌దిత‌ర షార్ట్ ఫిల్మ్ ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఆమె రెండు తెలుగు సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news