Moviesనిహారిక పెళ్లి ప్లేస్ అక్క‌డ ఫిక్స్ చేశారా...!

నిహారిక పెళ్లి ప్లేస్ అక్క‌డ ఫిక్స్ చేశారా…!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు పెళ్లి కుమార్తె నిహారిక దేశవ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాలు తిరుగుతూ పెళ్లికి కావలసిన షాపింగ్ చేస్తుండడంతో పాటు తన స్నేహితులతో కలిసి బ్యాచిల‌ర్‌ పార్టీలు కూడా ఎంజాయ్ చేస్తోంది. ఆమె వివాహం గుంటూరుకు చెందిన విశ్రాంత పోలీసు అధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి త‌న‌కు ఉన్న ప‌రిచ‌యంతోనే ఈ పెళ్లి కుదిర్చారు.

 

 

వీరి వివాహం డిసెంబర్ లో జరగనుంది. మామూలుగా మెగా డాటర్ పెళ్లి అంటే మంచి ధూమ్ ధామ్ గా జరగాలి. ప్రస్తుతం క‌రోనా కాలం కావడంతో సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా చాలా సింపుల్‌గా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా డాట‌ర్ నిహారిక పెళ్లి సైతం తమకు కావాల్సిన కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితులు.. సమక్షంలో మాత్రమే జ‌ర‌గాల‌ని మెగా ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందట. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

 

నిహారిక పెళ్లిని ముందుగా గోవాలో చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వెళ్లి వేదిక రాజ‌స్థాన్‌కు మారినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలను పెళ్లి కోసం పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతాల నుంచి ఒక వేదిక ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇక పెళ్లి గురించి నాగబాబు మాట్లాడుతూ డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని… పెళ్లి పనులు అన్నింటినీ వ‌రుణ్‌తేజ్‌ చూసుకుంటున్నాడు అని చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news