ఆ ఒక్క మాట‌తో ఏడుపు ఆపుకోలేక‌పోయిన అన‌సూయ‌..!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా ఉన్న అన‌సూయకు సామాజిక స్పృహ కూడా ఉంది. అప్పుడ‌ప్పుడు ఆమె సామాజిక అంశాల‌పై స్పందిస్తూ త‌న బాధ్య‌త‌ను గుర్తు చేసుకుంటుంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేసిన మెసేజ్ చూస్తే కొడుకు మాట‌ల‌కు ఆమె ఎంత బాధ‌ప‌డిందో అర్థ‌మ‌వుతోంది. 2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఎందరో జీవితాల్లో చీక‌టి సంవ‌త్స‌రంగా మిగిలిపోయింది. క‌రోనా దెబ్బ‌తో అంద‌రూ విల‌విల్లాడుతున్నారు.

 

 

మ‌న‌దేశంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ భారీన ప‌డ్డారు. వీరిలో చాలా మందికి క‌రోనా త‌గ్గినా ఇప్పుడు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌జ‌లు మ‌రిన్ని ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితులు చూసి ఆవేద‌న‌కు గురైన అన‌సూయ కొడుకు అనసూయ‌తో చేసిన వ్యాఖ్య‌లే ఆమెకు హార్ట్ ట‌చ్చింగ్‌గా అనిపించాయ‌ట‌.

 

 

 

అమ్మా నాకు 2017, 2018 సంవ‌త్స‌రాల్లోకి వెళ్లిపోవాల‌ని ఉంది.. ఆ స‌మ‌యంలో కోవిడ్ లేదు.. వ‌ర‌ద‌లు లేవు. అప్పుడు సంతోషంగా ఉన్నాన‌ని చెప్పాడ‌ట‌. కొడుకు చెప్పిన ఆ మాట‌కు అన‌సూయ క‌ళ్లల్లో ఒక్క‌సారిగా నీళ్లు వ‌చ్చాయ‌ట‌. కొడుకు చెప్పిన ఆ మాట‌ల‌ను అన‌సూయ ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ త‌న బాధ‌ను పంచుకున్నారు.