మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిలర్ ప్రీ ట‌జ‌ర్ వ‌చ్చేసింది.. అఖిల్‌కు ఫ‌స్ట్ హిట్ ప‌క్కా (వీడియో)

యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అర‌వింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ప్రీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. హాయ్ ఐ యామ్ హర్ష.. ఒక అబ్బాయి లైఫ్ లో 50 పర్సెంట్ కెరీర్.. 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్. కెరీర్ ని సూపర్ గా సెట్ చేశా.. కానీ ఈ మ్యారీడ్ లైఫ్.. అయ్యయ్యోయ్యో అన్న డైలాగ్ అఖిల్ టీజర్లో చెపుతున్నాడు.

 

ఏదేమైనా హ‌ర్ష కెరీర్ బాగున్నా మ్యారీడ్ లైఫ్ గురించి మ‌నోడికి ఎందుకంత టెన్ష‌న్ అన్న‌దే తెలియ‌ట్లేదు. ఇక ఈ టెన్ష‌న్‌కు కార‌ణం ఏంట‌న్న‌ది తెలియాలంటే అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటల వరకు వెయిట్ చేయ‌మ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఏదేమైనా ప్రీ టీజ‌ర్‌తోనే మంచి ఆస‌క్తిని రేపిన ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న‌దానిపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.