నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో బాలకృష్ణ, సౌందర్య, శ్రీహరి, శ్రీకాంత్, శరత్‌బాబు లాంటి ప్రధాన తారాగణంతో నర్తనశాల సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. అప్పుడెప్పుడో 16 – 17 సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు షూట్ చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల షూటింగ్ లేట్ అవ్వడం, ఆ తర్వాత ద్రౌపదిగా నటిస్తోన్న సౌందర్య హెలీకాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంతో ఈ సినిమా 17 ఏళ్లుగా మూలన పడింది.
అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా కోసం తీసిన సన్నివేశాలను ఎడిట్ చేసి 17 నిమిషాల సినిమాను దసరా కానుకగా శ్రేయాస్ ఓటీటీలోని ఎన్‌బీకే థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24 న రిలీజ్ అవుతుండగా రు. 50 పెట్టి చూడాలని నిర్ణయించారు. పౌరాణికం సినిమా అందులోనూ 17 నిమిషాలే కావడంతో పాటు ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని చారిటీ కోసం ఇస్తానని బాలయ్య ఇప్పటికే చెప్పడంతో బాలయ్య అభిమానులు భారీగా కలెక్షన్లు వచ్చేలా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
శ్రేయాస్ ఓటీటీ మాత్రం ఫస్ట్ టిక్కెట్ ఎన్టీఆర్‌తో కొనిపించి సినిమాకు హైప్ తేవాలని చూస్తోంది. అదే జరిగితే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మరి ఎన్టీఆర్ ఎప్పుడు బాబాయ్‌తో సత్సంబంధాలే కొరుకుంటాడు. ఈ పౌరాణిక సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫస్ట్ టిక్కెట్ కొంటే ఖచ్చితంగా నర్తనశాల ఓటీటీలో రికార్డుల దుమ్ము రేపడం ఖాయం.