బిగ్‌బాస్ 4లో చెత్త కంటెస్టెంట్ ఎవ‌రంటే..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 4 అంత ఆస‌క్తిగా అయితే ముందుకు సాగ‌డం లేదు. ముఖ్యంగా ఈ సీజ‌న్లో కంటెస్టెంట్లు మాత్ర‌మే కాదు.. ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ కూడా లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక గ‌త వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి సినిమాల్లో మంచి క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే హౌస్‌లో చాలా రోజుల వ‌ర‌కు ఎవ‌రితోనూ క‌ల‌వ‌కుండా చాలా ముభావంగా ఉన్నాడు.

 

ఆ త‌ర్వాత పుంజుకున్నా అప్ప‌టికే లేట్ అవ్వ‌డంతో అత‌డిని ఎలిమినేట్ చేసేశారు. హౌస్‌లో ఇత‌ర కంటెస్టెంట్ల‌తో అన‌వ‌స‌ర వివాదాల‌కు కూడా కుమార్ సాయి ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌డంతోనే అత‌డిని ఎలిమినేట్ చేశార‌న్న విమ‌ర్శలు వ‌చ్చాయి. అయితే హౌస్‌లో కుమార్ సాయి కంటే చెత్త కంటెస్టెంట్లు చాలా మంది ఉన్నార‌ని.. వారి కంటే కుమార్ సాయికి ఎక్క‌వ ఓట్లు వ‌చ్చినా కుమార్‌నే కావాల‌ని ఎలిమినేట్ చేశారంటూ అత‌డి అభిమానులు, నాగార్జున‌ను, బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు.

 

అయితే మ‌రి కొంద‌రు మాత్రం హౌస్‌లో ఏదో పోయిన‌వాడిలో ముభావంగా కుమార్ సాయి ఉండేవాడ‌ని.. అత‌డిని మించిన చెత్త కంటెస్టెంట్ ఎవ‌రూ లేర‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం మోనాల్ లాంటి చెత్త కంటెస్టెంట్‌ను ఇంకా హౌస్‌లో ఎందుకు ఉంచుతున్నార‌ని ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఏదేమైనా బిగ్‌బాస్ 4 అనేక వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది.