హైప‌ర్ ఆది నిజంగానే యాంక‌ర్ వ‌ర్షిణిని పెళ్లాడుతున్నాడా…!

తెలుగులో ఈటీవీలో ప్ర‌సారం అయ్యే ఢీ జోడి డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ల పెర్పామెన్స్ మామూలుగా లేదు. ఇక సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది, యాంక‌ర్లు ర‌ష్మీ గౌత‌మ్, వ‌ర్షిణి త‌దిత‌రులు త‌మ కామెడీతో షోకు మ‌రింత హంగులు అద్దుతున్నారు. ఈ షోలో టీం లీడ‌ర్లుగా ఉన్న ర‌ష్మీ, సుధీర్ బాగా పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు వీరు ఈ బుల్లితెర ప్రోగ్రామ్‌తో వ‌చ్చిన క్రేజ్‌తోనే వెండితెర ఛాన్సులు కూడా ద‌క్కించుకున్నారు.

 

సుడిగాలి సుధీర్ బుల్లితెర ప‌వ‌ర్ స్టార్ అయితే, ర‌ష్మీ సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు కూడా ద‌క్కించుకుంది. ఇక ఇటీవ‌ల ఈ ఢీ షోలో టీం లీడ‌ర్లుగా ఉన్న హైప‌ర్ ఆది, యాంక‌ర్ వ‌ర్షిణి మ‌ధ్య కూడా బాగానే కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతోంద‌న్న చ‌ర్చ‌లు జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రు నిజంగా ప్రేమ‌లో ఉన్నార‌ని.. పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

 

తాజాగా వీరిద్ద‌రు ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆది వ‌ర్షిణిపై పంచ్‌లు వేయ‌డంతో పాటు తాను స్క్రీన్ మీద ఆనందం కోస‌మే న‌టిస్తామే త‌ప్పా త‌మ మధ్య ఏం లేద‌న్నాడు. ఇక యాంక‌ర్ వర్షిణి ఇటీవ‌ల ఫుల్ బిజీ అవుతోంది. ప‌లు ఈవెంట్లు, షోల‌కు వ్యాఖ్యాత‌గా చేస్తూ ఫుల్ బిజీ యాంక‌ర్‌గా మారిపోయింది. ఇక వ‌ర్షిణి ఇటీవ‌లే ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా ద‌క్కించుకుందంద‌ని తెలుస్తోంది.